దిన్ దయాల్ అంత్యోదయ యోజన ఎందుకు (DAY)?
- పట్టణాలలో పల్లెలలో యువతకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి, (--> నిరుద్యోగం పోతుంది--> పేదరికం పోతుంది).
- అభివృద్ధి చెందిన దేశాలలో 2020 నాటికి 57 మిలియన్ శ్రామికల కొరత ఉంటుంది. కావున విదేశి కంపెనీలు ఈ శ్రామికలును వేరేదేశాలునుండి తెచుకోవలిసి ఉంటుంది.
- అందువలన మోడీ విదేశి కంపెనీలును భారత దేశం లో తమ ఉత్పత్తులును చేయమంటున్నాడు- "మేక్ ఇన్ ఇండియా" , కాని విదేశి కంపెనీలుకు క్రింది సౌకర్యాలు కావాలి.
- విదేశీయులు వ్యాపారాన్ని సులభతరం చేయడం.(ఉదా : అనుమతులు కోసం లంచాల లేకపోవం లాంటివి).
- స్తిరమైన పన్నుల విదానం.
- నైపుణ్యమైన మరియు చవకైన శ్రామికలు . (2020 నాటికీ ఇండియాలో 47 మిలియన్ శ్రామిక జనాబా ఉంటుంది).
- ప్రతిసంవత్సరం 12 మిలియన్లు మంది కొత్తగా శ్రామిక జనాబా తయారు అవుతుంది. వీరిలో 10% మంది మాత్రమే నైపుణ్యం గల శ్రామికులు, వీరు యురోపియన్ యూనియన్ లో 70%,చైనా లో 50% గా ఉన్నారు
- "మేక్ ఇన్ ఇండియా" విజయవంతం కావాలి అంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన అవసరం అని పై విషయాలు ద్వారా తెలుస్తుంది.
పధకం యొక్క వివరాలు
గ్రామీణ ప్రాంత యువకులు ఆకలి రాజ్యంలో హీరోలా ఆకలి బాధలు పడకుండా ఉండటానికి.
ఎవరు?
|
- గ్రామీణ ప్రాంతం: రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ.
- పట్టణ ప్రాంతం:మినిస్ట్రీ అఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ పోవేట్రీ అల్లెవేసన్(పట్టణ గృహ నిర్మాణ మరియు పేదిరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ)
|
ఎప్పుడు? |
- 2014, సెప్టెంబర్ నాడు దీని ప్రారంబించారు. సెప్టెంబర్ 25 నాడు అంత్యోదయ దివస్ ను జరుపుకోవాలి అని ప్రభుత్వం ప్రకటించింది.
- గ్రామిణ ప్రాంతాలలో : 2014 నుండి ప్రారంబం.
- పట్టణ ప్రాంతాలలో : 2016 నుండి .
|
ఎందుకు? | గ్రామిణ మరియు పట్టణ యువతకి నైపుణ్యం తో కూడిన శిక్షణ ఇవ్వడం. |
S1: గ్రామీణ దీన్ దయాల్
IF POOR FARMER “BHUVAN” DOESN’T WANT TO PAY LAGAAN, HE BETTER GET SKILL TRAINING & CHANGE PROFESSION
అధికారిక పేరు |
- దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీన్ కౌశల్య యోజన.
- SGSY=> NRLM => అజీవిక.
- ఆజీవిక లో నైపుణ్య అభివృద్ధి ఒక బాగంగా ఉంది, దీనిని దీన్దయాల్ ఉపాద్యాయ గ్రామీణ్ కౌసల్య యోజన.
|
ఎవరికోసం |
- 15 సంవత్సరాల నుండి ఉండే గ్రామీణ ప్రాంత యువకలుకు.
- ఇంతకముందు 18 సంవత్సరాలు ఉండే యువకులుకు.
|
లక్ష్యం |
- 2017 నాటికి 10లక్షల మంది యువకలుకు శిక్షణ.
|
- గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్య అభివృద్ధి కేంద్రలును ఏర్పాటు చేయడం.
- శిక్షణ ఇచ్చే సిలబస్ అంతర్జాతీయ ప్రమాణాలుకు తగ్గట్టు తయారు చేసి, వాటిలో శిక్షణ ఇవ్వడం దీనివలన "మేక్ ఇన్ ఇండియా" భారతదేశం లో ఉండే విదేశ పరిశ్రములలో పని చేసే అవకాశం ఉంటుంది.
- వికలాంగులుమీద ప్రత్యేకమైన శ్రద్ద కనపరుస్తారు.
S2: పట్టణ దీన్ దయాల్
అదికారనామం | దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన |
ఎవరికోసం | పట్టణ పేదలుకు |
లక్ష్యం | ప్రతి సంవత్సరం 5 లక్షల మందికి శిక్షణ |
దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన
- పది లక్షలతో పట్టణ ప్రాంతాలలో జీవనొపది కేంద్రాలు ఏర్పాటు చేయడం.
- ప్రతి పట్టణ పేద వ్యక్తికి ఈ కేంద్రాలు ద్వారా శిక్షణ ఇవ్వడం.ప్రభుత్వం ఒక్కొకరిపైన 15-18 వేలు శిక్షణ కోసం ఖర్చుపెడుతుంది. ప్రతి సంవత్సరం 5 లక్షల మందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యం.
- పట్టణ స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేయడము . వాటిని బ్యాంక్లు తో అనుసందిచడం. ఒక్కో గ్రూప్ కి 10,000/- ఇస్తారు.
- వెండర్ మార్కెట్ లు ఏర్పాటు చేయడం.(వెండర్ = అమ్మకందారుడు), అమ్మకం దారులుకు కూడా శిక్షణ ఇవ్వడము.
- ఇండ్లు లేని పట్టణ పేదలికి ఇల్లు నిర్ముంచట మరియు కనీస సౌకర్యాలు కల్పించుట.
- పేదలు పరిశ్రమలు పెట్టేటట్టు ప్రోత్సహించుట. వారికి 7% వడ్డీకి ఋణం ఇచ్చుట.
పరిశ్రమ | వడ్డీ సబ్సిడీ |
ఒక్కో వ్యక్తి ఏర్పాటు చేసే సూక్ష్మ పరిశ్రమ | Rs. 2 lakh |
బృందంగా ఏర్పడి ఏర్పాటు చేసే పరిశ్రమ | Rs. 10 lakh |
NSDC తో దీన్ దయాల్ ఒప్పందం
- నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ)(NSDC) తో పట్టణ గృహ నిర్మాణ మరియు పేదిరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ MoU కుదుర్చుకుంది.
- మార్కెట్ అవసరాల ప్రకారం జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ పేద యువతకి శిక్షణ ఇస్తుంది
- జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ - లబ్దిదారులును గుర్తిస్తుంది, మరియు సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ద్వారా శిక్షణ ఇస్తుంది
- సెక్టార్ స్కిల్ కౌన్సిల్ : పరిశ్రమల నేతృత్వంలోని సంస్థలు. ఒక పారశ్రామిక విబాగం కి సంబంధించి వాటికి కావలిసిన సిలబస్ మరియు స్టాండర్డ్స్ ను నిర్ణయిస్తుంది.
NRLM and NULM
ఈ రెండిటి మద్య తేడాలు
NRLM | NRUM |
పూర్వ నామం : స్వర్ణజయంతి గ్రామ్ యోజన(SGSY). | పూర్వనామం:స్వర్ణజయంతి సహరి స్వరోజ్గార్ యోజన. |
నేషనల్ రూరల్ లైవ్లిహుడ్ మిషన్ గా పేరు మార్చారు. | నేషనల్ అర్బన్ లైవ్లిహుడ్ మిషన్ గా పేరు మార్చారు. |
చివరిసారి ఆజీవికగా పేరు మార్చారు. | ----(మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అని పేరు మార్చలేదు కావొచ్చు) |
గ్రామీణ అభివృద్ధి శాఖా మంత్రిత్వ శాఖా | పట్టణ గృహ నిర్మాణ మరియు పేదిరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ |
- ప్రతి ఇంటి నుండి ఒక వ్యక్తిని స్వయం సహాయక బృందంలో చేర్పించి బ్యాంకు రుణాలు+సబ్సిడీ+శిక్షణ ఇప్పించి తద్వారా ఆదాయాన్ని సంపాదించేటట్టు చేయడం.
- దీనిలో బాగంగా "ఆజీవిక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం" ఉండేది. దీనిపేరు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన
|
- వీది వ్యాపారులుకు సులబతరంగ రుణాలు అందిస్తారు.
- గృహాలులేని వారికి అవాసాలు కల్పించుట.
|
ఎకనామిక్ సర్వే:
- అగర్బత్తి,కుండల తయారి లాంటి చిన్న వ్యాపారులులో ఆజీవిక మంచి ఫలితం కనపర్చినది.
- కాని ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి వ్యాపార కార్యకలాపాలు పెంచడం మీద దృష్టి పెట్టలేదు.
ఆజవీక: బడ్జెట్-2014
- కొన్ని వెనుకబడిన జిల్లాలో మహిళా స్వయం సహాయక బృందాలుకు తక్కువ వడ్డీ రెట్లుకి ఋణాలు ఇస్తారు.
- 2014 బడ్జెట్లో వెనుకబడిన జిల్లాల సంఖ్య పెంచారు.
వడ్డీ రేట్ | 2014 బడ్జెట్ ముందు | తరువాత |
4% | 150 వెనుకబడిన జిల్లాలు | 250 |
7% | మిగతా జిల్లాలు | మారలేదు (7%) |
దీనికి అదనంగా గ్రామీణ యువతకి "స్టార్ట్ అప్ ఎంటర్ప్రేనుర్శిప్ ప్రోగ్రాం" ని 2014 బడ్జెట్లో ప్రకటించారు.