కరెంట్ ఆఫ్ఫైర్సు గ్రూప్సు పరిక్షలుకు ప్రాణం లాంటిది, కరెంటు అఫ్ఫైర్స మీద పట్టు సాదిస్తే గ్రూప్సు మీద పట్టు సాదించినట్టే, కరెంటుఅఫైర్స్ ప్రతి సబ్జెక్టు తో సంబంధం కలిగి ఉంటుంది. కొంత మంది చరిత్రకి సంబంధం లేదు అనుకుంటారు కానీ ఉంటుంది ఉదాహరనుకు మనం చిన్నప్పుడు చదువుకొనేటప్పుడు సింధు ప్రజలుకు గుర్రం తెలియదు అని ఉంటుంది కానీ వాళ్ళకు గుఱ్ఱము తెల్సు అని ఇటివల తవ్వకలులోబయటపడింది. కరెంటుఅఫైర్స్ చదివేటపుడు ప్రతి సబ్జెక్టు తో అనుసందానం చేసుకుని చదివితే సులబంగా మన గ్రూప్స్ గమ్యంను చేరుకోవచ్చు.కరెంటుఅఫైర్స్ కోసం రోజు పేపర్ చదవాలి, పేపర్ చదవకుండామగ్జిన్స్ మిధ ఆధార పడడం మంచిది కాదు. నేను వివిధ పేపర్స్, బూక్సు చదివి మీ కోసం ఇక్కడ కొంత సమాచారం పెడుతున్న, ఇది మీకు తప్పకుండ పనికొస్తుంది అని బావిస్తున్న. మీకు గ్రూప్స్ గురించి ఎలాంటి సందేహం ఉన్న నన్ను అడగవచ్చు
OCTOBER-2014 CURRENT AFFAIRS
OCTOBER-2014 CURRENT AFFAIRS
This comment has been removed by the author.
ReplyDeletenaku march feb 2013 current affairs kavali pls post that
Deleteజపాన్ - యుఏఈ మధ్య అణు విద్యుత్ ఒప్పందం
ReplyDeleteమే 3 న జపాన్ ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు అణు విద్యుత్ సాంకేతిక బదిలీ కి సంబందించిన ఒప్పందం కుదుర్చుకున్నాయి .2011 లో ఫుకుషిమా అణు సంక్షోభం , భారి భూకంపం మరియు సునామీ వంటి విపత్తులు ఏర్పడిన తర్వాత జపాన్ ద్వైపాక్షిక అణు ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి .పెర్షియన్ గల్ఫ్ రాష్ట్రం లో జరిగిన సమావేశం లో ఈ ఒప్పందం ఫై జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే మరియు యుఏఈ ఉపాధ్యక్షుడు మరియు ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తొవమ్ సంతకాలు చేశారు .
Thank you Ajay for your valuable information
Deleteఉత్తర ఐర్లాండ్ లో జి-8 దేశాల 39 వ శిఖరాగ్ర సదస్సు
ReplyDeleteజి8 దేశాల 39 వ శిఖరాగ్ర సదస్సు జూన్ 17 -18 తేదిల్లో ఉత్తర ఐర్లాండ్ లోని ఫెర్మానాగ్ కౌంటీలో జరిగింది.ఈ 39వ జి8 సదస్సులో బ్రిటన్, అమెరికా, రష్యా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలున్నాయి .రెండు రోజుల సదస్సు ముగింపు సందర్బంగా సిరియా కు సంబందించిన ఏడు అంశాలతో కూడిన ఉమ్మడి ప్రకటనకు జి-8 దేశాల అధినేతలు అంగీకరించారు.రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు ఒబామా సిరియా యుధ్ధ నివారణకు శాంతి చర్చలు జరపాలని నిర్ణయించారు . అలాగే ఐర్‌లాండ్ ప్రధాని స్టెఫెన్ హార్పర్ సిరియాకు 115 మిలియన్ డాలర్లు సహాయంగా అందిస్తున్నట్టు ప్రకటించారు.2009లో లండన్‌లో జరిగిన రెండు జి20 సమావేశాలకు హాజరైన ప్రతినిధులపై బ్రిటన్ గూఢచర్యం చేసిందనే ఆరోపణల నేపథ్యంలో జి8 సదస్సు ప్రారంభమైంది.2014 లో జి8 సదస్సు రష్యాలో జరగనుంది. దక్షిణ ప్రాంతంలోని నల్లసముద్ర విహార ప్రాంతం సోచిలో 2014, జూన్ 4-5 తేదీల్లో ఈ సదస్సు జరగనున్నట్లు అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ప్రకటించారు.
కేంద్ర కేబినెట్ పునర్వవ్యవస్థికరణ
ReplyDelete"జూన్ 17 న ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కేంద్ర మంత్రి వర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు.ఎనిమిది మంత్రి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో నలుగురికి క్యాబినెట్ హోదా, నలుగురికి సహాయ మంత్రి హోదాలు లభించాయి.కొత్త మంత్రులచే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రమాణస్వీకారం చేయించారు. ప్రస్తుతం కార్మిక శాఖ మంత్రిగా ఉన్న మల్లిఖార్జు ఖర్గేను రైల్వే శాఖకు మార్చారు.ప్రస్తుతం జరిగిన పునర్వవ్యవస్థికరణ తో యూపీఏ ప్రభుత్వంలోని మంత్రుల సంఖ్య 77కు పెరిగింది.ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న మంత్రుల సంఖ్య జైరాంరమేశ్‌తో కలుపుకొని 13కు పెరిగింది.
నలుగురు కొత్త కేబినెట్ మంత్రులు , శాఖ వివరాలు :-
* శీష్‌రాం ఓలా - కార్మిక, ఉపాధి కల్పన శాఖ
* అస్కార్ పెర్నాండేజ్ - ఉపరితల రవాణా శాఖ
* గిరిజా వ్యాస్ - గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, దారిద్య్ర నిర్మూలన శాఖ
* కావూరి సాంబశివరావు - జౌళిశాఖ
నలుగురు సహాయ మంత్రులు , శాఖ వివరాలు :-
* మాణిక్‌రావ్ గవిట్ - సామాజిక న్యాయం, సాధికారత శాఖ
* సంతోష్ చౌదరి - ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
* జేడీ శీలం - ఆర్థికశాఖ
* ఇఎంఎస్ నాచియప్పన్ - వాణిజ్యం, పరిశ్రమల శాఖ "
2011-12 (జూలై-జూన్) పేదరికం మరియు గృహ వినియోగదారుల ఖర్చు సూచిక వివరాలు విడుదల
ReplyDelete.2011 జూలై - 2012 జూన్ మధ్యకాలానికి సంబంధించి దేశం లో పేదరికం మరియు గృహ వినియోగదారుల ఖర్చు సూచిక కు సంబందించిన వివరాలను జాతీయ నమూనా అధ్యయన సంస్థ కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌వో) జూన్ 20 న విడుదల చేసింది.2011-12 (జూలై-జూన్) మధ్య 7496 గ్రామాల్లో, 5263 పట్టణాల్లోని ప్రాంత బ్లాకుల శాంపిల్స్ ఆధారంగా నేషనల్ శాంపిల్ సర్వే కార్యాలయం ఈ 68వ రౌండ్ సర్వేను నిర్వహించింది.
2011-12 (జూలై-జూన్) పేదరికం మరియు గృహ వినియోగదారుల ఖర్చు సూచిక వివరాలు :-
* 2011 జూలై నుంచి 2012 జూన్ మధ్య కాలానికి సంబంధించిన ఈ గణాంకాలను బట్టి జనాభాలోని 5 శాతం అట్టడుగువర్గ ప్రజల నెలవారీ సగటు తలసరి ఖర్చు గ్రామాల్లో 521.44 రూపాయలు ఉంటే పట్టణ ప్రాంతాల్లో 700.50 రూపాయలుగా ఉంది.
* దేశంలో నిరుపేదలు గ్రామాల్లో అయితే రోజుకు 17 రూపాయలతో, అదే పట్టణాల్లో అయితే రోజుకు 23 రూపాయలతో బతికేస్తున్నారని పేర్కొంది .
* దేశ జనానాలో 5 శాతం సంపన్న వర్గాల తలసరి నెల ఖర్చు గ్రామ ప్రాంతాల్లో అయితే 4,481 రూపాయలు ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 10,282 రూపాయలుగా ఉంది.
* మొత్తంమీద జాతీయ స్థాయిలో సగటున తలసరి నెల ఖర్చు గ్రామీణ భారతంలో 1430 రూపాయలు ఉండగా, పట్టణ ప్రాంతాల్లో దాదాపు రెట్టింపు అంటే 2,630 రూపాయలుగా ఉంది.
* గ్రామీణ భారతంలో ప్రతి కుటుంబం చేసే ఖర్చులో 52.9 శాతం సొమ్మును ఆహారంపై ఖర్చు చేస్తున్నారు. గృహాలకు అవసరమైన ఇంధనం, విద్యుత్‌పై 8 శాతం ఖర్చు చేస్తూ ఉంటే, వైద్య ఖర్చులకోసం 6.7 శాతం, విద్యకు 3.5 శాతం ఖర్చు చేస్తున్నారు.
* అదే పట్టణ ప్రాంతాల విషయానికి వచ్చేసరికి ప్రతి కుటుంబం ఆహారం కోసం 42.6 శాతం ఖర్చు చేస్తూ ఉంటే, విద్య కోసం 6.9 శాతం, ఇంధనం, విద్యుత్ కోసం 6.7 శాతం, ప్రయాణ ఖర్చులకోసం 6.5 శాతం, దుస్తులు, పాదరక్షలు లాంటి వాటి కోసం 6.4 శాతం ఖర్చు చేస్తోంది.
"
i want jan feb march month current affires
ReplyDeletejan
ReplyDeletesir how to prepare economics for group 2
ReplyDeleteI want 2016 current affairs
ReplyDeleteI want 2016 current affairs
ReplyDeleteI want 2016 current affairs
ReplyDelete