Sunday 2 November 2014

APPSC-Current Affairs : Din Dayal Antyodaya Yojana


దిన్ దయాల్ అంత్యోదయ యోజన ఎందుకు (DAY)?

  • పట్టణాలలో పల్లెలలో యువతకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి, (--> నిరుద్యోగం పోతుంది--> పేదరికం పోతుంది). 
  • అభివృద్ధి చెందిన దేశాలలో 2020 నాటికి 57 మిలియన్ శ్రామికల కొరత ఉంటుంది. కావున విదేశి కంపెనీలు ఈ శ్రామికలును వేరేదేశాలునుండి తెచుకోవలిసి ఉంటుంది.  
  • అందువలన మోడీ విదేశి కంపెనీలును భారత దేశం లో తమ ఉత్పత్తులును చేయమంటున్నాడు- "మేక్ ఇన్ ఇండియా" , కాని  విదేశి కంపెనీలుకు క్రింది సౌకర్యాలు కావాలి. 
    1. విదేశీయులు వ్యాపారాన్ని సులభతరం చేయడం.(ఉదా : అనుమతులు కోసం లంచాల లేకపోవం లాంటివి).
    2. స్తిరమైన పన్నుల విదానం.
    3. నైపుణ్యమైన మరియు చవకైన శ్రామికలు . (2020 నాటికీ ఇండియాలో 47 మిలియన్ శ్రామిక జనాబా ఉంటుంది).
  • ప్రతిసంవత్సరం 12 మిలియన్లు మంది కొత్తగా  శ్రామిక జనాబా తయారు అవుతుంది. వీరిలో 10% మంది మాత్రమే నైపుణ్యం గల శ్రామికులు, వీరు యురోపియన్ యూనియన్ లో 70%,చైనా లో 50% గా ఉన్నారు 
  • "మేక్ ఇన్ ఇండియా" విజయవంతం కావాలి అంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన అవసరం అని  పై విషయాలు ద్వారా తెలుస్తుంది. 
పధకం యొక్క వివరాలు 
 గ్రామీణ ప్రాంత యువకులు ఆకలి రాజ్యంలో హీరోలా ఆకలి బాధలు పడకుండా ఉండటానికి. 
ఎవరు?

  • గ్రామీణ ప్రాంతం: రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ.  
  • పట్టణ ప్రాంతం:మినిస్ట్రీ అఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ పోవేట్రీ  అల్లెవేసన్(పట్టణ గృహ నిర్మాణ మరియు పేదిరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ) 
ఎప్పుడు?
  • 2014, సెప్టెంబర్ నాడు దీని ప్రారంబించారు. సెప్టెంబర్ 25 నాడు అంత్యోదయ దివస్ ను జరుపుకోవాలి అని ప్రభుత్వం ప్రకటించింది. 
  • గ్రామిణ ప్రాంతాలలో : 2014 నుండి ప్రారంబం.
  • పట్టణ ప్రాంతాలలో : 2016 నుండి .
ఎందుకు?గ్రామిణ మరియు పట్టణ యువతకి నైపుణ్యం తో కూడిన శిక్షణ ఇవ్వడం. 

S1: గ్రామీణ దీన్ దయాల్ 

IF POOR FARMER “BHUVAN” DOESN’T WANT TO PAY LAGAAN, HE BETTER GET SKILL TRAINING & CHANGE PROFESSION
అధికారిక పేరు 
  • దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీన్ కౌశల్య యోజన. 
  • SGSY=> NRLM => అజీవిక.
  • ఆజీవిక లో నైపుణ్య అభివృద్ధి ఒక బాగంగా ఉంది, దీనిని దీన్దయాల్ ఉపాద్యాయ గ్రామీణ్ కౌసల్య యోజన. 
ఎవరికోసం 
  • 15 సంవత్సరాల నుండి ఉండే గ్రామీణ ప్రాంత యువకలుకు. 
  • ఇంతకముందు 18 సంవత్సరాలు ఉండే యువకులుకు.
లక్ష్యం 
  • 2017 నాటికి 10లక్షల మంది యువకలుకు శిక్షణ.
  • గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్య అభివృద్ధి కేంద్రలును ఏర్పాటు చేయడం. 
  • శిక్షణ ఇచ్చే సిలబస్ అంతర్జాతీయ ప్రమాణాలుకు తగ్గట్టు తయారు చేసి, వాటిలో శిక్షణ ఇవ్వడం దీనివలన "మేక్ ఇన్ ఇండియా" భారతదేశం లో ఉండే విదేశ పరిశ్రములలో పని చేసే అవకాశం ఉంటుంది. 
  • వికలాంగులుమీద  ప్రత్యేకమైన శ్రద్ద కనపరుస్తారు.

S2: పట్టణ దీన్ దయాల్ 

అదికారనామం దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన 
ఎవరికోసం పట్టణ పేదలుకు 
లక్ష్యం ప్రతి సంవత్సరం 5 లక్షల మందికి శిక్షణ

దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన 

  1. పది లక్షలతో పట్టణ ప్రాంతాలలో జీవనొపది కేంద్రాలు ఏర్పాటు చేయడం.
  2. ప్రతి పట్టణ పేద వ్యక్తికి ఈ కేంద్రాలు ద్వారా శిక్షణ ఇవ్వడం.ప్రభుత్వం ఒక్కొకరిపైన 15-18 వేలు శిక్షణ కోసం ఖర్చుపెడుతుంది. ప్రతి సంవత్సరం 5 లక్షల మందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యం. 
  3. పట్టణ స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేయడము . వాటిని బ్యాంక్లు తో అనుసందిచడం. ఒక్కో గ్రూప్ కి 10,000/- ఇస్తారు. 
  4. వెండర్ మార్కెట్ లు ఏర్పాటు చేయడం.(వెండర్ = అమ్మకందారుడు), అమ్మకం దారులుకు కూడా శిక్షణ ఇవ్వడము. 
  5. ఇండ్లు లేని పట్టణ పేదలికి ఇల్లు నిర్ముంచట మరియు కనీస సౌకర్యాలు కల్పించుట. 
  6. పేదలు పరిశ్రమలు పెట్టేటట్టు ప్రోత్సహించుట. వారికి 7% వడ్డీకి ఋణం ఇచ్చుట.  
పరిశ్రమ వడ్డీ సబ్సిడీ 
ఒక్కో వ్యక్తి ఏర్పాటు చేసే సూక్ష్మ పరిశ్రమ Rs. 2 lakh
బృందంగా ఏర్పడి ఏర్పాటు చేసే పరిశ్రమ Rs. 10 lakh

NSDC తో దీన్ దయాల్ ఒప్పందం 

  •  నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ)(NSDC) తో పట్టణ గృహ నిర్మాణ మరియు పేదిరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ MoU కుదుర్చుకుంది. 
  • మార్కెట్ అవసరాల ప్రకారం జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ పేద యువతకి శిక్షణ ఇస్తుంది 
  • జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ - లబ్దిదారులును గుర్తిస్తుంది, మరియు సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ద్వారా శిక్షణ ఇస్తుంది 
  • సెక్టార్ స్కిల్ కౌన్సిల్ : పరిశ్రమల నేతృత్వంలోని సంస్థలు. ఒక పారశ్రామిక విబాగం కి సంబంధించి వాటికి కావలిసిన సిలబస్ మరియు స్టాండర్డ్స్ ను నిర్ణయిస్తుంది. 

NRLM and NULM

ఈ రెండిటి మద్య తేడాలు 
NRLMNRUM
పూర్వ నామం : స్వర్ణజయంతి గ్రామ్ యోజన(SGSY).పూర్వనామం:స్వర్ణజయంతి సహరి స్వరోజ్గార్ యోజన. 
నేషనల్ రూరల్ లైవ్లిహుడ్ మిషన్ గా పేరు మార్చారు. నేషనల్ అర్బన్ లైవ్లిహుడ్ మిషన్ గా పేరు మార్చారు. 
చివరిసారి ఆజీవికగా పేరు మార్చారు. ----(మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అని పేరు మార్చలేదు కావొచ్చు)
గ్రామీణ అభివృద్ధి శాఖా మంత్రిత్వ శాఖాపట్టణ గృహ నిర్మాణ మరియు పేదిరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ
  • ప్రతి ఇంటి నుండి ఒక వ్యక్తిని స్వయం సహాయక బృందంలో చేర్పించి బ్యాంకు రుణాలు+సబ్సిడీ+శిక్షణ ఇప్పించి తద్వారా ఆదాయాన్ని సంపాదించేటట్టు చేయడం.
  •  దీనిలో బాగంగా  "ఆజీవిక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం"  ఉండేది. దీనిపేరు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన 
  • వీది వ్యాపారులుకు సులబతరంగ రుణాలు అందిస్తారు. 
  • గృహాలులేని వారికి అవాసాలు కల్పించుట.
ఎకనామిక్ సర్వే:
  • అగర్బత్తి,కుండల తయారి లాంటి చిన్న  వ్యాపారులులో ఆజీవిక మంచి ఫలితం కనపర్చినది.
  • కాని ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి వ్యాపార కార్యకలాపాలు పెంచడం మీద దృష్టి పెట్టలేదు.
ఆజవీక: బడ్జెట్-2014
  • కొన్ని వెనుకబడిన జిల్లాలో మహిళా స్వయం సహాయక బృందాలుకు తక్కువ వడ్డీ రెట్లుకి ఋణాలు ఇస్తారు. 
  • 2014 బడ్జెట్లో వెనుకబడిన జిల్లాల సంఖ్య పెంచారు. 
వడ్డీ రేట్  2014 బడ్జెట్ ముందు తరువాత 
4%150 వెనుకబడిన జిల్లాలు 250
7%మిగతా జిల్లాలు మారలేదు  (7%)
దీనికి అదనంగా గ్రామీణ యువతకి  "స్టార్ట్ అప్ ఎంటర్ప్రేనుర్శిప్ ప్రోగ్రాం" ని 2014 బడ్జెట్లో ప్రకటించారు.  

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. The dedication to clean, durable design that won us over in 2012 has carried through to their latest product, the Adventure Log. http://rarwo4n35e.dip.jp http://38ghfx7vr6.dip.jp http://c1a6dmk7h1.dip.jp

    ReplyDelete