Saturday, 11 May 2013

Appsc Current Affairs - May 2013

                                                   మే 
ఈ సమాచారానికి ఇంకా కొంత అదనంగా చేర్చాల్సి ఉంది.

  • పాకిస్తాన్ జైలులో తోటి  ఖైదీల దాడి కి గురయిన భారతియ ఖైది సరబ్జిత్ సింగ్ మృతి చెందారు. సరబ్జిత్ సింగ్  పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాడు. పాకిస్తాన్ లో భారత రాయభారి శరత్ శబర్వాల్. 
    • వరల్డ్ వైడ్ వెబ్ సృష్టించి మే-2 నాడికి దాదాపుగా 20 సంవత్సరాలు ఐంది, మొదటి సారిగా వరల్డ్ వైడ్ వెబ్ ని 1993 లో ప్రవేశపెట్టారు, భారత దేశం లో 1995 ముంబై నగరం లో మొదటి సారిగా ప్రవేశపెట్టారు. వరల్డ్ వైడ్ వెబ్ సృష్టి కర్త టింబెర్నెర్. 
    • RBI వార్షిక పరపతి సమీక్షా :
              *రేపో రేట్  ను 7. 5నుండి 7.25కి తగించింది           *CRR ను  యదవిధగా 4.25 వద్ద ఉంచింది          *2013-14  సంవత్సర వృద్ది రేట్ 5. 7%  గా అంచనా వేస్తుంది.(ప్రభుత్వం బడ్జెట్ లో 6.1-6.7% మద్య వృద్ది వుంటుంది అని అంచనా వేసింది )         *సంవత్సరుపు మధ్యంతర పరపతి సమీక్షా జూన్ 17నాడు చేయనుంది. 
    • 2012 సివిల్స్ పరీక్షలో ప్రధమ స్థానం కేరళ కి చెందిన హరిత వి. కుమార్(కేరళ) సాదించారు. సివిల్స్ లో వరుసుగా మూడో సారి కూడా మహిళే ప్రధమ స్థానం లో నిలిచింది. ద్వీతీయ స్థానం వి.శ్రీరాం(కేరళ) తృతీయ స్థానం స్తుతి చరణ్(రాజస్తాన్). 
    • మిస్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్  విజేత గా  నేహళ్ భోగైట్ నిలిచారు. రెండో స్థానం లో జస్పిర్ కౌర్ శిందు(మలేసియా) నిలిచింది 
    • జమ్మూ కాశ్మీర్ జైలులోని పాకిస్తాన్ తీవ్రవాది సనౌల్ల పైన తోటి ఖైదీలు దాడి చేసారు 
    • పాకిస్తాన్ లో ప్రముఖ న్యాయవాది ఐన చౌదరి జుల్ఫీకర్ ని దుండగలు  హత్య చేసారు. ఇతను పాక్ మాజీ ప్రదాని బెనజీర్ బుట్టో , 26/11 ముంబై దాడులు కేసులును వాదిస్తున్నాడు 
    • మే 5 నాడు కర్ణాటక ఎన్నికులు జరిగాయి. ఈ ఎన్నికలలో అధికార బి జె పి ఓడిపోయింది,మొత్తం 224 స్థానాలు(ఒక స్థానంలోఅబ్యర్ధి మృతి చెందడం తో  ఎన్నిక వాయిద పడింది ) లో కాంగ్రెస్ 121, BJP-40,JDS-40,KJP-6,BSR-4,SP-1 సీట్లు గెల్చుకున్నాయి. సిద్దరామయ్య 22 వ ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యారు, సిద్దరామయ్య  తోపాటు మరో 20 మంది మంత్రులగా ప్రమాణ స్వీకారం చేసారు, కర్ణాటక గవర్నర్ H.బరద్వాజ్, ఎన్నికల అధికారి అనిల్ కుమార్ జా.  
    • చైనా అక్రమంగా చొరబడిన భారత భూబాగం దౌలత్ బెఘ్ లోడి(జమ్మూ కాశ్మీర్ ) నుండి తన బలగాలను ఉపసంహరించుకుంది. 
    • నల్లదనాన్ని తెల్ల ధనం గా మార్చే పక్రియలును కొన్ని బ్యాంకులు నిర్వహిస్తున్నాటు కోబ్రా పోస్ట్ వెల్లడించింది. ఆపరేషన్ రెడ్ స్పైడర్ అనే పేరుతో జరిపిన శులశోదనలో ఈ విషయం బయలుపడింది 
    • చలన చిత్ర పరిశ్రమ 100 సం.. పూర్తి ఐన సందర్బంగా భారత ప్రభుత్వం తపలబిల్లలు విడుదలచేసింది, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఎస్ వి రంగారావు , బానుమతి , అల్లు రామలింగయ్య పేర్ల మిధ కూడా తపాల బిల్లలును విడుదల చేసింది 
    • మే-6 నాడు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు విగ్రహమును పార్లమెంట్ ఆవరణలో ఆవిష్కరించారు, ఈ గౌరవం ఇంతక ముందు టంగుటూరి ప్రకాశం పంతులుకు , ఆచార్య ఎన్ జి రంగా గారికి లబించింది 
    • మే 11 నాడు జరిగిన పాకిస్తాన్ ఎన్నికలో నవాజ్ షరీఫ్ అద్వర్యం లో గల పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) విజయం సాదించింది, రెండో స్థానం లో అధికార పాకిస్తాన్ పుపిల్స్ పార్టీ నిలిచింది, మూడో స్థానం లో ఇమ్రాన్ ఖాన్ స్తాపించిన తెహ్రికే ఇన్సాఫ్ నిలిచింది. ముషారఫ్ స్థాపించిన  అల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్నికలను బహిష్కరించింది.  పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ(భారత్ లో లోక్ సభ తో సమానం) లో 342 స్థానాలు కలవు ఇందిలో 272 మంది ప్రజల చేత నేరుగా ఎన్నికోబడతారు, మిగతావారిని వివిధ పార్టీలనుండి మైనార్టీ, మహిళలును నామినేట్ చేస్తారు.  

    • కోల్ గేటు స్కాం  
      (బొగ్గు కుంబకోణం) లో సి బి ఐ తయారుచేసిన నివేదికను సుప్రీం కోర్ట్ కు సమర్పించకముందే న్యాయశాఖ మంత్రి చూసారు అనే వివాదం లో కేంద్రన్యాయ శాఖామంత్రి అశ్విన్ కుమార్ రాజీనామా చేసారు, న్యాయ శాఖా అధనుపు బాద్యతులు కపిల్ సిబాల్ కి అప్పగించారు.  ఇదే వివాదం లో అదనుపు సొలిసిటర్ జెనెరల్ హరేన్ రావెల్ కూడా రాజీనామా చేసారు. 

    • రైల్వే బోర్డు లో పదివి ఇవ్వడానికి లంచం తీసుకుంటూ కేంద్ర రైల్వే శాఖా మంత్రి పవన్ కుమార్ బన్సాల్ బంధువు సి బి ఐ కి దొరికిపోవడం తో పవన్ కుమార్ బన్సాల్ తన పదవికి రాజీనామా చేసారు. 
    • తమిళనాడు లో నిర్మించన కుడంకులం అణురియాక్టర్ ప్రారంబం కి సుప్రీం కోర్ట్ అనుమతినిచింది. 
    • 2011 భారత జనాబా లెక్కలు ప్రకారం(తుది లెక్కలు) 2011 నాటికి భారత్ జనాభా 121,07,26,932 కు చేరింది.  2001 నాటి తో పోలిస్తే 18.19 కోట్లు పెరింగింది అనగా 17. 7 శాతం పెరిగింది. అక్షరాస్యత 64.8 (2001నాటికి) నుండి 74 శాతానికి చేరింది. గ్రామీణ జనాబా 83. 35 కోట్లు , పట్టణ జనాభా 37.71కోట్లు. ప్రతి 1000 మంది పురుషులుకు 943 మంది స్రీలు మాత్రమే కలరు. భారత జనాభా లెక్కల కమిసినర్ చంద్రమోహన్ . 
    • 2011 ఆంధ్రప్రదేశ్  జనాబా లెక్కలు ప్రకారం(తుది లెక్కలు) 2011 నాటికి  ఆంధ్రప్రదేశ్ జనాభా 8,4580,777 కు చేరింది.  2001 నాటి 17. 7 శాతం పెరిగింది. గ్రామీణ జనాబా 5.63 కోట్లు , పట్టణ జనాభా 2.62 కోట్లు. ప్రతి 1000 మంది పురుషులుకు 992 మంది స్రీలు కలరు.అక్షరాస్యత 67.02 శాతానికి చేరింది.  ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల కమిసినర్ వై అనురాధ. 
    • ప్రపంచంలో అత్యంత ప్రతిబవంతలైన 100మంది వైద్యులలో మెదక్ కు చెందిన మంగ శివలింగాగౌడకు స్థానం లబించింది. ఈ నివేదకను Cambridge International Biographical Centre రూపొందించింది. 
    • ప్రత్యక ఆంధ్ర  కోసం ఏర్పాటు ఐన ఆంధ్రమహాసభ ఏర్పాటు అయ్యి మే 26 నాటికి వంద సంవత్సారులు ఐంది, ఈ సందర్బంగా బాపట్లలో శతజయంతి ఉత్సవాలు జరిపారు . 
    • చార్ దామ్ యాత్ర(ఉత్తరాఖండ్) మే 12 నాడు ప్రారంబం ఐంది, ఈ యాత్ర 6నెలలు తరువాత ప్రారంబమైంది. 
    • మే-14నాడు అధికార భాషా దినోత్సవం గా జరుపుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి P.K. మహంతి  ఉత్తర్వులు జారీచేసారు, అధికార భాషా  సంఘం అద్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, అధికార భాషా వినియోగం లో రాష్ట్రం లో నల్గొండ జిల్లా ప్రధమ స్థానం లో నిలిచింది. 
    • సౌది అరేబియా లో స్థానికలుకు ఉద్యోగ అవకాశాలు పెంచెందేకు అ దేశ ప్రభుత్వం నితాఖాట్ చట్టమును తిసుకురానుంది, ఈ చట్టం ప్రకారం ప్రతి 10 మంది వలస కార్మికులుకు ఒక స్థానికుడు ఖచితంగా పనిలో ఉండాలి. 
    •   National Platform For Disaster Risk Riduction ప్రధమ సమావేశాన్ని ప్రధాని ఢిల్లీ లో ప్రారంబించారు. ప్రకృతి విపత్తులు , మానవ విద్వంసాలు నష్టపోయేవారికి తక్షణమే సహాయం అందేల ప్రమాద బీమా సౌకర్యం ఉండాలని ప్రధాని తెలిపారు. 
    • పర్యావరణ నిర్వహణ సూచీ-2012'లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. నాణ్యమైన గాలి, నీరు, అడవుల కోసం అత్యుత్తమ పర్యావరణ అనుకూల విధానాలను అవలంభించినందుకు రాష్ట్రానికి ఈ ఘనత దక్కింది.మన రాష్ట్రం తర్వాత సిక్కిం, హిమాచల్ ప్రదేశ్‌లు నిలిచాయి.ఈ జాబితాలో చివరి స్థానంలో (35వ స్థానం) లక్షద్వీప్ నిలిచింది.
    • వర్థమాన దేశాల్లో 2030 కల్లా భారత్, చైనా ముందుంటాయని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన 'గ్లోబల్ డెవలప్‌మెంట్  ఆరిజన్స్' నివేదిక వెల్లడించింది. 2030 కల్లా అంతర్జాతీయ స్థూల పెట్టుబడుల్లో ఈ రెండు దేశాల వాటా 38 శాతంగా ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు.2011లో 700 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2030 కల్లా 850 కోట్లకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది.
    • మహాసేన్ తుపాను బంగ్లాదేశ్, శ్రీలంక లో ఏర్పడింది, ఈ తుఫాను తో కోస్తా ఆంధ్రా లో అక్కడక్కడ వర్షాలు కురిసాయి. 
    • భారత ప్రదేశక సేనలో మొదట మహిళ జవాను ఐన శాంతి తిగ్గా జలపాయిగురి లో మృతి చెందింది. 
    • దేశంలో రాష్ట్రాలు వెనుకుబాటుతనం నిర్ధారించేందుకు కేంద్రం ఒక కమిటి వేసింది ఈ కమిటి అధ్యక్షుడు రఘురామరాజన్. గత బడ్జెట్ లో చేసిన ప్రకటన మేరుకు ఈ కమిటిని వేసారు, రాష్ట్రాల తలసరి ఆదాయం, మానవ అభివృద్ధి సూచి ఆధారంగా ఈ కమిటి వేనుకుబాటుతనం నుం అంచనా వేస్తుంది. 
    • జూన్-1వ తేది నుండి దేశం లో వంటగ్యాస్ సబ్సిడీ కోసం నగదు బదిలీ పధకం ను దేశం లో 20 జిల్లలో ప్రయోగాత్మకం గా ప్రవేశపెట్టనున్నారు, మన రాష్ట్రం లో 5 జిల్లాలును ఎంపిక చేసారు అవి:అంతపురం,తూర్పుగోదావరి , చిత్తూర్ , హైదరాబాద్ , రంగారెడ్డి. 
    • అస్సాం నుండి మన్మోహన్  సింగ్ రాజ్యసభ సభ్యునిగా నామినేట్ అయ్యారు, 1991 లో మన్మోహన్ సింగ్ తొలిసారి రాజ్యసభకు నామినేట్ అయ్యారు , ఇది ఐదవ సారి. 
    • సైన్స్ అండ్ టెక్నాలజీ:
    • సోలార్ ఇమ్పల్సు : ఇది సూర్య కాంతి తో నడిచే విమానం , ఇది రాత్రి పగలు కూడా ప్రయాణించగలదు 
    • మచిలీపట్టణంలో క్షిపణి పరీక్షా కేంద్రం ను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ శాఖామంత్రి అంథోని తెలిపారు 
    • విశాకపట్నం తీరప్రాంతం లో గస్తికోసం రాణి అబ్బాక అనే నౌకను జలప్రవేశం చేసారు 
    • మిగ్ -29కే అను కొత్త తరము యుద్దవిమానం ను గోవా తీరం లో ప్రారంబించారు, దీనిని INS విక్రమాదిత్య తో అనుసందిస్తారు. 
    • తామరపువ్వు జన్యుపటాన్ని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. 
    • స్పేస్ (అంతరిక్షం) లో మొదట సారి పాట పాడిన కెనడా వ్యామోగామి సోయజ్ వ్యామోనౌక ద్వారా భూమికి చేరుకున్నాడు.  
    • ఐనిస్టీన్ యొక్క సాపేక్ష సిద్దాంతం ఆదారంగా నాసా శాస్త్రవేత్తలు ఒక కొత్త గ్రహన్ని(మన సౌర కుటుంబంకు ఆవల) కనుకొన్నారు దీనికి కెప్లెర్-76బి అనే పేరు పెట్టారు. 
    • మనిషి డి ఎన్ ఏ లో వ్యర్ధపధార్డం ఏమి లేదు అని సి సి ఎం బి(CCMB-Hyderabad) శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది వరకు మనిషి డి ఎన్ ఏ లో కేవలం 2%మాత్రమే ఉపయోగపడుతుంది అని అనుకొనే వారు. CCMB డైరెక్టర్ మోహన్ . 
    • ఐ పి ఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంబకోణం లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్ళు ఐన శ్రీశాంత్ , చండిలా , అంకిత్ చవాన్ లు పట్టుపడ్డారు, వీరిని పోలీసులు అరెస్ట్ చేసారు. 

    నియామకాలు :
    • మలేసియా లో అధికార పార్టీ ఐన బారిసన్ నేషనల్ పార్టీ తిరిగి విజయం సాదించింది. ప్రధాని గా నజిజ్ రజాక్ ఎన్నిక అయ్యారు. 
    • ఆంధ్ర ప్రదేశ్ శాసన పరిసత్తు ప్రతిపక్ష నాయకుడుగా తెలుగు దేశం పార్టీ కి చెందినా యనముల రామ కృష్ణుడు నియమింపబడ్డారు, శాసన పరిసత్తు చైర్మన్ గా చక్రపాణి గారు ఉన్నారు.
    • ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లో ఆటగాళ్ళ తరుపున ప్రతినిదిగా భారతదేశం కు చెందిన శివరామకృష్ణ ఎంపిక అయ్యారు, మరోక ప్రతినిదిగా శ్రీలంక ఆటగాడు కుమార సంగకర కొనసాగుతున్నారు. 
    • బ్రెజిల్ కి చెందిన రాబర్ట్ అజివేడో ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) డైరెక్టర్ జనరల్ గా మే 8 నాడు నియమితులుయ్యారు, ఇది వరకు ఈ బాద్యతులును ఫ్రాన్స్ కి చెందిన పాస్కల్ లామే ఉన్నారు, WTO 1995 లో జెనివా కేంద్రంగా ఏర్పడింది. 
    • ఆసియా అబివృద్ది బ్యాంకు(Asia Development Bank) 9వ అధ్యక్షుడుగా జపాన్ కు చెందిన తకహితో ఎన్నికయ్యారు. 46 వ ఆసియా అబివృద్ది బ్యాంకు వార్షిక సమావేశం న్యూ ఢిల్లీ లో జరిగింది. 
    • కెనడా లో భారత సంస్కృత సంబందాల మండలి అద్వర్యం లో కొత్తగా నెలకొల్పబడిన సంస్కృతిక కేంద్రానికి ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ ఎన్నికయ్యారు. 
    • శ్రీకాకుళం లోని డా. బి అర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి గా లాలాలజిపతి రాయి నియమింపబడ్డారు, రాష్ట్రంలో ఉండే విశ్వవిద్యాలయంలుకు రాష్ట్ర గవర్నర్ కులపతిగా ఉంటారు. 
    • అరుణాచలప్రదేశ్ గవర్నర్ గా నిర్బయ్ శర్మ నియమితులు అయ్యారు. 
    • ఆంధ్ర ప్రదేశ్ మైనారిటీ కమిషన్ చైర్మన్ గా అబిద్ రసూల్ ఖాన్, వైస్ చైర్మన్ గా నేతాజీ సుబాష్ చంద్రబోష్ నియామకం పొందారు. వీరితోపాటు మరో 5 మంది సభ్యులు కూడా నియమితులుయ్యారు, వీరి పదివికాలం 5 సంవత్సరాలు.

    అవార్డ్లు:
    • ఎన్ టి అర్  విజ్ఞాన్ వారు బహుకరించే సాహిత్య పురస్కారం మనోజదాస్(ఒరిస్సా) కి లబించింది. 
    • రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ ప్రధానం చేసే  వైట్లి అవార్డు ను ప్రముఖ పర్యావరణవేత్త అపరాజిట్ దత్తకి దక్కింది. ఈమెకు అరుణాచల్ ప్రదేశ్ లో హార్న్ బిల్ పక్షిని సంరక్షిస్తున్నందుకు లబించింది. 
    • హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ అధ్యాపకడు ఐన వంశీ వకులంబారణం కు అమర్త్యసేన్ అవార్డు లబించింది. 
    • సి ఎన్ ఎన్ ఐ బి ఎన్ (CNN-IBN) ఛానల్ నిర్వహించిన సర్వేలో వందేళ్ళ భారత సినీ చరిత్ర ఉత్తమ చిత్రంగామాయాబజార్ ఎంపిక అయ్యింది. 
    • మే-11 నర్సులు దినోత్సవం సందర్బంగా జాతీయ ఫ్లోరెన్స్ నైట్ యంగెల్ అవార్డు ను 35 మంది నర్సులుకు అందించారు, వీరిలో ఆంధ్ర ప్రదేశ్ నుండి  లీలశ్యామల ఉన్నారు . 
    క్రీడలు : 
    • బాడ్మింటన్  మలేసియా గ్రాండ్ ప్రీ టైటిల్ ను పి ఏ సింధు గెలుచుకుంది, సిన నేహవాల్ తరువాత గ్రాండ్ ప్రీ గెలుచుకున్న రెండో భారతీయ క్రీడా కారిణి గా రికార్డ్ నెలకొల్పింది. సింధు సింగపూర్ కు చెందిన జువాంగు మిధ విజయం సాదించింది 
    • ప్రపంచ చెస్ చాంపియన్షిప్ నవంబర్ 6-26 వరకు చెన్నై లో జరగనున్నాయి,. 
    • మాడ్రిడ్ (స్పెయిన్) ఓపెన్ ఫైనల్ లో పురుషుల విభాగం లో రాఫ్ఫెల్ నాదల్ విజియం సాదించారు, మహిళల విభాగం లో సెరీనా విలియమ్స్ విజియం సాదించింది. ఈమెకి ఈ విజియం 50వది. 



    1 comment:

    1. సిరియా తిరుగుబాటుదారులపై ఆయుధాల నిషేధం రద్దు చేసిన ఈయూ
      మే 27 న సిరియా తిరుగుబాటుదారులపై ఆయుధాల నిషేధం రద్దు చేసినట్లు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) విదేశాంగ మంత్రులు ప్రకటించారు.సిరియా ప్రతిపక్షంపై ఆయుధ నిషేధాన్ని పునరుద్దరించబోమని తెలిపారు .సిరియా ప్రభుత్వంపై ఆయుధాల నిషేధం మినహా మిగిలిన ఇతర ఆంక్షలు కొనసాగనున్నాయి.

      ReplyDelete