Wednesday, 22 October 2014

APPSC CURRENT AFFAIRS : NISAR 2020, GSLV-MK-3, GSAT-16 and LAM

                                              నిసార్ 



NISAR అంటే ఏమిటి ?


పూర్తి పేరు NASA-ISRO Synthetic Aperture Radar (NISAR) mission
ఎప్పుడు ప్రయోగిస్తారు 2020

ఈ మిషన్ వలన  ఉపయోగం ఏమిటి  ? 

  • భూమి మిధ ఉండే భూ తలం , హిమ తలం , హిమశికరాలు , అగ్ని పర్వతాలు , భూ కంపాలలో వచ్చే మార్పులును అద్యననం చేస్తుంది 
  • ఆ మార్పులుకు గల కారణాలును , వాటి వాళ్ళ సంబవించే పరిణమాలును అంచనా వేస్తుంది. 
  • ఇది L - బ్యాండ్ మరియు S బ్యాండ్ లను వినియోగించడం వలన భూమిని ఒక సెంటీమీటర్ రేజల్యుసన్ తో చిత్రికరించగలదు. 
  • దీనివలన వాతావరణంలోసంబవించే మార్పులును తెల్సుకోవచ్చు 
  • సహజ విపత్తులును ముందుగా గుర్తించ వచ్చు 
ఎవరు ఏ పరికరాలును సమకూరుస్తారు ?
NASAISRO
  • L-band
  • సింథటిక్ అపెర్చార్ రాడార్  (SAR)
  • GPS
  • ఘన స్థితి లో ఉన్న రికార్డర్ 
  • S-Band
  • లాంచ్ వెహికల్ 
  • స్పేస్ క్రాఫ్ట్ బస్సు 

GSAT-16: కమ్యునికేసన్ శాటిలైట్ 

  • ప్రస్తుతము ఉన్న శాటిలైట్ : INSAT -3E 
  • INSAT-3E : ఇది రేడియో , టీవీ , ఇంటర్నెట్ (అంతరజాలం) లకు కావలసిన సంకేతలును అందిస్తుంది 
  • ఇది ఒక దశాబ్ద కాలం గా పనిచేస్తుంది , కావున దీని జీవిత కాలం ముగిసింది. 
  • అందువలన INSAT -3E ని GSAT-16 తో బర్తి చేస్తున్నారు 
GSAT-16: ముఖ్యాంశాలు 
ఎప్పుడు ప్రయోగిస్తారు 2015, జూన్ 
రకం
  • కమ్యునికేసన్ ఉపగ్రహం 
  • టివి రేడియో ఇంటర్నెట్ కొరకు 
బరువు 3100 kg
ప్రయోగ వాహన నౌక European Ariane-5 launcher

                                 GSLV MARK-3

PSLV మరియు GSLV మద్య భేదాలు 
PSLVGSLV
Polar satellite launch vehicleGeosynchronous satellite launch vehicle
మొదటి ప్రయోగం  19932001.
మోయగల బరువు : 1600 కె జి 2500 కె జి 
 CARTOSAT, RISAT, OCEANSAT, RESOURCESAT లాంటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ లలో వాడారు INSAT 2E, 3A…., GSAT-2,8,12. లాంటి ఇండియన్ శాటిలైట్ లలో వాడారు 

 PSLV-XL: ఈ శ్రేణిలో అత్యాదునికమైన వాహన నౌక ఇది  1750 kg వరుకు మోయగలదు .దీనిని చంద్రయాన్ రిసాట్ లాంటి ఉపగ్రహాల ప్రయోగాలలో వాడారు 
  • నూతన శ్రేణి :  GSLV MK-3

What is GSLV Mk-3?

 GSLV -Geosynchronous satellite launch vehicle యొక్క నూతన శ్రేణి 
GSLV , GSLV MK -3 మద్య భేదం 
(సాదారణ ) GSLVGSLV Mk-3
మోయగల భరువు :  2500 kg వరుకు 
  •  4500-5000,  INSAT-4 ఉపగ్రహాల ప్రయోగానికి వాడుతారు 
  • ఇప్పటి వరకు ఇన్సాట్-4 ప్రయోగానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ఏరియన్ లాంచ్ వెహికల్ ని వాడేవాళ్ళం 
పొడువు : 49 మీటర్లు 
  • కేవలం 42.4మీటర్లు 
బరువు : 414 టన్నులు 629టన్నులు .
  • ఈ సంవత్సరం నవంబర్ / డిసెంబర్ లో ఇస్రో దీనిని పరీక్షిస్తుంది. 
GSLV MK-3 కి మూడు దశలు కలవు .
1వ దశఘన ఇందన దశ 
2వ దశద్రవ  ఇందన దశ 
3వ దశక్రయోజెనిక్ ఇంజిన్ .
GSLV MK-3 కి వివిధ దశల గల కక్ష్యలలో లో ఉపగ్రహాన్నిపెట్టగల సామర్ద్యం గలదు  :
  • GTO (జియో ట్రాన్స్ ఫెర్ ఆర్బిట్ )(కక్ష్య = ఆర్బిట్ )
  • LEO (లో ఎర్త్ ఆర్బిట్ )లేదా పోలార్ ఎర్త్ ఆర్బిట్ 
  • మద్యస్థ ఆర్బిట్ లు 
  • పై ఆర్బిట్ లలో దేనిలోనైన ఉపగ్రహాన్ని పెట్టగల సామర్ద్యం గలదు 

Liquid Apogee Motor (LAM)

రెండు రకాల ఉపగ్రహ ప్రయోగ(లాంచ్) ఇంజిన్ లు  కలువు  
ఘన ఇంధనం 
  • ఒక్కసారి దీనిని మండిస్తే , ఇందనం అయ్యేవరకు నిరంతరం పనిచేస్తుంది 
  • కావున దీని వేగాన్ని నియంత్రంచాలేము 
ద్రవ ఇందనము 
  • ప్రయోగ వాహన నౌక కావలిసిన వేగాన్ని అందుకున్నాక వీటిని అపేయవచ్చు 
  • వీటిని అవసరం అనుకున్నప్పుడు మరల స్టార్ట్ చేయ వచ్చు కావును ఉపగ్రహాన్ని నిర్ణిత కక్ష్యలో సురిక్షతంగా చేర్చవచ్చు 
  • LAM- Liquid Apogee Motor: ద్రవ ఇందనము తో నడిచే ఇంజిన్ లలో వాడే ఒక పరికరం. 
  • LAM - ఉపగ్రహం నిర్ణిత కక్ష్యలో చేరేందుకు వాడుతారు .
  • LAM లో ఉండే రసాయనాలు : హీలియం , నైట్రోజన్ టెట్రా ఆక్సైడ్ , మోనో ఇథైల్ హైడ్ర జైన్ 
  • ఇస్రో  దీనిని ఇన్సాట్ ఉపగ్రహాల ప్రయోగాలు లో వాడడానికి తాయారు చేసింది 
  • దీనిని ఈ మద్య కాలం లో మంగళయాన్ మరియు IRNSS ప్రయోగాలలో వాడారు. 


Monday, 20 October 2014

New India Assurance Recruitment 2014 - Administrative Officer Posts:

New India Assurance Vacancy Details: Administrative Officer Posts:
Total No. of Posts: 509
Name of the Posts: Administrative Officer (Scale-I)
Name of the Discipline:
1. Finance: 65 Posts
2. Engineering: 25 Posts
3. Automobile Engineering: 30 Posts
4. Legal: 40 Posts
5. Generalist: 349 Posts

 Educational Qualification (as on 01.10.2014)
Candidate should possess certificate in proof of passing the qualifying examination as on 01.10.2014.
For Generalist Stream, a candidate must possess the minimum qualification of a Degree in any discipline from a recognized University OR any equivalent qualification recognized as such by Central Government.
For Specialist Stream a candidate must possess the minimum qualification of Degree in the relevant discipline from a recognized University OR any equivalent qualification recognized as such by Central Government
`
The minimum Educational Qualifications required for various disciplines are:

1 Finance :  Chartered Accountant (ICAI) / Cost Accountant (ICWA)/ MBA FINANCE* / B.COM / M.COM
2 Engineering :  B.Tech /B.E (in Civil / Mechanical / Electrical / Electronics & Communication Engineering).
3 Automobile Engineering : B.E./B.Tech. in Automobile Engineering OR Graduate in Mechanical Engineering with Diploma (at least one year duration) in Automobile Engineering.
4 Legal : Graduate in Law.
5 Generalist : Graduate in any stream.

* MBA Finance candidates must furnish certificate from university confirming their specialization in finance at the time of interview, failing which they will not be allowed 
to appear for the interview. 

Important Dates:
Starting Date for Submission of Online Applications: 11-10-2014.
Last Date for Submission of Online Application: 03-11-2014.
Last Date for Reprint of Application: 18-11-2014.
Dates of Payment of Fee: 11-10-2014 to 03-11-2014.
Tentative Date of Online Exam: 10-01-2015/ 11-01-2015.


New India Assurance Recruitment 2014 - Assistant Posts

New India Assurance Vacancy Details-Assistant Posts
Total No.of Posts: 1536 Name of the Post: Assistant Class-III

Name of the Category:1. SC: 175 Posts2. ST: 74 Posts3. OBC: 457 Posts4. General: 830 Posts

Exam  Fee
Candidates should pay Rs.50/- for SC/ ST/ PWD/ Ex-SER/ Female candidates, Rs.500/- for Other category candidates through online by using debit cards (Rupay/ Visa/ Master), Credit cards , Internet Banking , IMPS, Cash Cards/ MobileWallets – Vodafone MPesa, Airtel Money, Oxicash, Mobikwik, Paycash etc.

Important Dates:Starting Date for Submission of Online Applications: 11-10-2014.Last Date for Submission of Online Application: 03-11-2014.Last Date for Reprint of Application: 18-11-2014.Dates of Payment of Fee: 11-10-2014 to 03-11-2014.Tentative Date of Online Exam: 10-01-2015/ 11-01-2015.

Apply Online 




APPSC - Current Affairs - IRNSS , PSLV-C26 , GAGAN topics


IRNSS అంటే ఏమిటి ?
  • IRNSS  = ఇండియన్ రీజినల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టం 
  • భారత ప్రభుత్వం దీనిని 2006 లో 1500 కోట్ల బడ్జెట్ తో ఆమోదించింది 
  • దీనిలో 7 శాటిలైట్లు ఉంటాయి. ఈ 7 శాటిలైట్లు భూమి చుట్టు తిరుగతూ భారత దేశాన్ని దాని సరిహద్దులలో 1500 కి మీ వరకు పోజిసినింగ్ సేవలును అందిస్తుంది. 
  • అమెరికా గ్లోబల్ పోజిసినింగ్ సిస్టం (GPS ) లో 24 శాటిలైట్లు ఉండి, భూమి అంతటా పోజిసినింగ్ సేవలును అందిస్తుంది. 
  • బ్యాలలు (కర్ణాటక) లో ఉన్న ISRO నావిగేషన్ సెంటర్ నుండి  దీనిని నియంత్రిస్తారు. 
  • దీనిలో ఉన్న మొత్తం 7 శాటిలైట్లు మూడు భూ స్థిర కక్ష్య లో (geostationary Earth orbit or geosynchronouse quatorial orbit (GEO)), నాలుగు భూ అనువర్తిత కక్ష్యలో ప్రవేసపెడతారు.  ఒక కక్ష్య, భూమి నుండి చూసినప్పుడు  ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటె ఆ అలాంటి కక్ష్యని భూ స్థిర కక్ష్య అంటారు. ఈ కక్ష్య భూమధ్యరేఖ నుండి సరాసరి 36000 కిమీ ఉంటుంది.  
  • ఇండియన్ రీజినల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టం లో ఉండే 7 శాటిలైట్లు భూమి నుండి దాదాపుగా 36000కి మీ ఉంటాయి. 
  • 7 శాటిలైట్లులో  ఇప్పటివరకు 3 శాటిలైట్లు ప్రయోగించారు. 
  • తాజాగా కక్ష్యలోకి చేరిన ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1సి   పదేళ్లపాటు సేవలు అందిస్తుంది. 
  • 2015 నాటికి ఈ వ్యవస్థ సిద్ధమవుతుంది. 
  • IRNSS -1A :  
  1. వాహన నౌక (రాకెట్) : PSLV C-22 
  1. సంవత్సరం : 2013- జూలై 
  1. ప్రయోగ ప్రదేశం : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ - నెల్లూరు ఆంధ్ర ప్రదేశ్ 
  • IRNSS -1B  :  
  1. వాహన నౌక (రాకెట్) : PSLV C-24 
  1. సంవత్సరం : 2014-  ఏప్రిల్ 
  1. ప్రయోగ ప్రదేశం : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ - నెల్లూరు ఆంధ్ర ప్రదేశ్ 
  • IRNSS -1C :  
  1. వాహన నౌక (రాకెట్) : PSLV C-22 
  1. సంవత్సరం : 2014- అక్టోబర్ 16 (ఇస్రో మొదట సారి  PSLV-D2 ద్వారా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ను అక్టోబర్, 1994 నాడు ప్రయోగించింది)(ఉపగ్రహం = శాటిలైట్ )
  1. ప్రయోగ ప్రదేశం : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ - నెల్లూరు ఆంధ్ర ప్రదేశ్ 
  1. ఉపగ్రహం బరువు : 1452 కే జి (APPSC పరిక్షల లో ఉప గ్రహమ్ బరువు ఎంత , విద్యాబాలన్ చివర సినిమా ఏది , హుదుద్ సైక్లోన్ లో ఎంత మంది చనిపోయారు లాంటి చిల్లర ప్రశ్నలు అడుగుతారు కావున జాబు వచ్చే  వరుకు ఇలాంటి డేటాని బట్టి కొట్టాలిసిందే)
  1. దీనిలో రెండు పే లోడ్లు కలవు- a) వినియోగాదారులుకు నావిగేషనల్ సిగ్నల్ పంపడానికి ఉపయోగపడే పరికరం b) సైనికులుకు ఉపయోగపడే లేసర్ రెంజింగ్ కి వాడే C-బ్యాండ్ ట్రాన్స్ పండర్లు. 
IRNSS   ఉపయోగాలు : 
  • ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ వ్యవస్థ భూతల, ఆకాశ, సాగరాల్లో దిశానిర్దేశ సేవలను అందిస్తుంది. విమానాలు, ఓడల గమనాన్ని నిర్దేశించడంలో సాయపడుతుంది.
  • ప్రతి ఒక్కరు కి ఉపయోగపడే స్టాండర్డ్ పోజిసినింగ్ సేవాలు 
  • కేవలం సైన్యం మరియు ప్రభుత్వం మాత్రమే వాడ గల నియంత్రిత సేవలును అందిస్తుంది(Restricted Services)
  • అమెరికన్ GPS 10 మీటర్ల ఖచితత్వం తో పనిచేస్తే, IRNSS 15 మీటర్ల ఖచితత్వం తో పనిచేస్తుంది. 
  • వివిధ రకాలైన సెల్ ఫోన్ అప్ప్స్ లో వాడుతున్నారు (డ్రైవింగ్ , దారులు తెల్సుకోవడం లో )
  • అడవలలో రేగే కార్చిచ్చు, అంతరించి పోయే జంతు జాతులును తెల్సుకోడానికి 
  • విపత్తు నిర్వహణలో ఉపయోగ పడ్తుంది 
మనం ఇప్పటివరకు అమెరికా కి చెందిన GPS ని , రష్యా కి చెందిన GLONASS ని వినియోగిస్తున్నం.

ఇప్పటికే GPS,GLONASS ఉండగా ఈ IRNSS  గొడవ ఎందుకు??

మనం తరుచూ వినే క్షిపణులు సుదూరం లో ఉండే తమ లక్ష్యాలును చేరుకోడానికి GPS/GLONASS వాడుతాయి,
అంటే GPS/GLONASS లు చెప్పే దారిలో  మన క్షిపణులు  ప్రయాణిస్తాయి అవి తప్పు చెప్తే అవి తప్పుడు గమ్యాన్ని చేరుకుంటాయి. పాకిస్తాన్ తో యుద్ధం వస్తే తన మిత్ర దేశం అమెరికా, తన GPS ద్వారా తప్పుడు సంకేతాలు ఇస్తుంది, అదే విదంగా చైనా తో యుద్ధం వస్తే తన మిత్ర దేశం రష్యా GLONASS ద్వారా తప్పుడు సంకేతాలు ఇచే ప్రమాదం ఉంది. అందు వలన మన దేశం కూడా సొంత నావిగేషన్ సిస్టం ని ఏర్పాటు చేసుకుంటుంది.

వివిధ దేశాల  నావిగేషన్ సిస్టంల పేర్లు : 
  • అమెరికా : GPS ( రీడర్ కామెంట్ : ఆర్టికల్ ప్రారంబం నుండి ఈ పేరు తో చాచిపోతున్నాం రా బాబు )
  • రష్యా : GLONASS 
  • చైనా : Beidou 
  • యూరోప్ : గెలీలియా
  • జపాన్  : క్వాసీ-జెనిత
  • భారత్ : IRNSS 
PSLV C-26 : 
  • పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్- సి26 పీఎస్ఎల్‌వీ శ్రేణిలో 28వ వాహక నౌక. ఎక్స్ఎల్ వెర్షన్‌కు సబంధించి ఇది 7వ ప్రయోగం. ఇప్పటివరకు 28 పీఎస్ఎల్‌వీలను ప్రయోగించగా, మొదటి ప్రయోగం తప్ప మిగతా 27 విజయవంతమయ్యాయి.
  •  తాజాగా నింగిలోకి వెళ్లిన పీఎస్ఎల్ఎల్‌వీ పొడవు 44.4 మీటర్లు. బరువు 320 టన్నులు. 
  • ఇందులో నాలుగు దశలు ఉండగా ఒకటి, మూడు దశల్లో ఘన ఇంధనం, రెండు, నాలుగు దశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించారు. పీఎస్ఎల్‌వీకి రూ.100 కోట్లు, ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1సి ఉపగ్రహానికి రూ.142 కోట్లు వ్యయం చేశారు. 

GAGAN (Global Positioning System Aided Geo Augmented Navigation System ) : 
  • విమానయాన రాకపోకల నియంత్రానికి మరియు  సమన్వయానికి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా మరియు ఇస్రో  ఒక జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రకిటించారు 
  • ఇది అమెరికా కి చెందిన గ్లోబల్ పోజిసినింగ్ సిస్టం మిధ పడ్తుంది . 
  • దీని కోసం 2011 మే లో ఒక పే లోడ్ ని GSAT -8 లో ప్రయోగించారు. 

Sunday, 19 October 2014

APPSC Current Affairs - Nobel Prize winners -2014



నోబెల్ ప్రైజ్ పుట్టుక :
  • 1896 : డైనమేట్ కనిపెట్టిన అల్ఫ్రెడ్ నోబెల్ మృతి, అతను ఫిజిక్స్ కెమిస్ట్రీ మెడిసిన్ లిటరేచర్  శాంతి  రంగాలలో కృషి చేసిన వారికి అవార్డులు ఇచేందుకు ఒక ఫండ్ ఏర్పాటు చేసాడు 
  • 1901 : అవార్డులు ప్రధానం ప్రారంబమైంది, ఒక్కో కేటగరీ లో గరిస్థంగా ముగ్గురుకి ఇస్తారు 
  • అవార్డు కి నామినేట్ అయ్యేసరికి సదురు వ్యక్తి జీవిస్తూ ఉండాలి . 
  • అక్టోబర్ లో అవార్డు విజేతలును ప్రకటించి, డిసెంబర్ 10 నాడు అవార్డులును ప్రధానం చేస్తారు 
అవార్డులుకు మనీ ఎవరు ఇస్తారు :
  • ఎకానమీ :  బ్యాంకు  అఫ్  స్వీడన్ (Riksbank)
  • మిగతా కేటగిరి అవార్డులు : నోబెల్ ఏర్పాటు చేసిన ఫండ్ నుండి ఇస్తారు . 
అవార్డులు ఎవరు ఇస్తారు :
  • ఓస్లో - నార్వే : నోబెల్ శాంతి బహుమతి
  • స్టాక్ హోం -స్వీడన్ : మిగతా కేటగిరి అవార్డులు
నోబెల్ ప్రైజ్ మీద  ఏమి రాసిఉంటుంది 
  • Economics : ఏమి రాసి ఉండదు 
  • శాంతి : For the peace and brotherhood of men.
  • మిగతా కేటగిరి అవార్డులు : And they who bettered life on earth by new found mastery
భౌతిక శాస్త్ర కేటగిరి - 2014

  1. ఈసము ఆకసకి (జపాన్ )
  2. హిరోషి  అమనో (జపాన్ )
  3. శుజి నకమురా (అమెరికా )
20 సంవత్సరాలు క్రితం వీరు ఇండియం గాలియం నైట్రేడ్ అనే సెమి కండక్టర్ ను ఉపయోగించి బ్లూ  LED((light emitting diode) ను కనుగొన్నారు. ఇది వైట్ LED ఉత్పత్తి కి ఉపయోగ పడింది. ప్రస్తుతం LCD కన్నా LED లైట్  చాలా శ్రేష్థమైనది. 

వైద్య రంగం -2014:
నోబెల్ బహుమతి ని అక్టోబర్ నెలలో మొదటగా ఈ రంగంలోనే ప్రకటిస్తారు 
  1. జాన్ ఓ కీఫే (యు కె )
  2. మే - బిర్ట్ట్ మోసర్ (నార్వే )
  3. ఎడ్వర్డ్ మోసర్ (నార్వే )
ఖాళీ ప్రదేశంలో ఉన్నప్పుడు మన స్థితిని తెలుసుకోవడానికి దోహదపడే పొజిషనింగ్ వ్యవస్థను కనుక్కున్నందుకు వీరికి  ఈ పురస్కారం దక్కింది,ఈ పరిశోధన అల్జీమర్స్, మెదడుకు సంబంధించిన ఇతర వ్యాధులకు చికిత్సలు చేయడానికి దోహదపడుతుంది. 

రసాయన శాస్త్రం -2014:

  1. ఎరిక్ బెత్జిగ్ (US)
  2. విలియం మోఎర్నేర్ (US)
  3. స్టీఫన్ హెల్ (జర్మనీ)


ఈ ముగ్గురూ 'సూపర్ - రిసాల్వ్‌డ్ ఫ్లోరసెన్స్ మైక్రోస్కోపీ' అభివృద్ధికి దోహదపడ్డారు, దీనిద్వారా సూక్ష్మ వస్తువులను పెద్దగా చూపే మైక్రోస్కోప్‌లకు మరింత సునిశిత దృష్టిని సాధ్యపడింది

ఈ మద్య వార్తలలోకి వచ్చిన ఇలాంటి ఒక భారతీయ అంశం :
కాన్ఫోకల్ మైక్రోస్కోప్ :
  • భారతీయ శాస్త్రవేత్తలు దీనిని డిజైన్ చేసారు 
  • దీనికి కౌన్సిల్ ఫర్ సైన్టిఫక్  అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఆర్థిక తోడ్పాటు అందించింది 
  • ఇన్ఫ్రారెడ్ బీమ్ ఉపయోగించి 3D చిత్రలును తయారుచేస్తుంది, ఇలాంటి మైక్రోస్కోప్ బయట దేశాలు నుండి దిగుమతి చేస్తే 4 కోట్లు వరుకు ఉంటుంది , కాని మన కాన్ఫోకల్ మైక్రోస్కోప్ 1.5 కోట్లు మాత్రమే. 

ఆర్థిక శాస్త్రం -2014 :
  • జీన్ తిరోలె (ఫ్రాన్స్)
  • ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలను  నియంత్రించక పోతే =>ప్రైవేటు ఎకస్వామ్యం (మోనోపోలీ )వస్తుంది => కొత్త వారు మార్కెట్ లోకి ప్రవేశించలేరు => అప్పుడు పోటితత్వం పడిపోతుంది  => ఇది ప్రైవేటు కంపెనీలు ధరులు పెంచడానికి దోహదపడుతుంది  => దీని వల్లన మొత్తం మార్కెట్ వ్యస్తే కూలిపోతుంది .
  • టెలికాం,బ్యాంకింగ్,తయారి రంగము మొదలైన పారిస్రమలును జాతియం చేయకుండా ఎలా నియంత్రించాలో  జీన్ వివరించాడు, దీని ద్వార ప్రైవేటు ఎకస్వామ్యలును అరికట్టవచ్చు
శాంతి రంగం -2014 :
  • కైలాశ్ సత్యార్థి(భారత దేశం)
  • మలాలా యూసఫ్ జాయ్‌(పాకిస్తాన్ )
వెట్టిచాకిరి నుంచి బాలలను విముక్తి చేయడానికి పాటుపడుతున్న భారతదేశానికి చెందిన కైలాశ్ సత్యార్థి, బాలికల విద్య కోసం పోరాడుతున్న పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్ జాయ్‌కు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని సంయుక్తంగా ప్రకటించారు.

కైలాష్  సత్యార్తి :
  • మధ్యప్రదేశ్ కి చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ 
  • బచపాన్ బచావు ఆందోళన్ అనే సంస్తను చిన్నారులు కోసం నడుప్తున్నారు 
  • 80,000 వరకు చిన్నరులును వివిధ కర్మాగారాలు, ఇటుక బట్టి పనులునుండి కాపాడారు,  కొన్నిసార్లు స్థానిక గుండాలు చేత దాడికి కూడా గురికాబడ్డారు. 
  • UNESCO ప్రారంబించిన ఎడ్యుకేషన్ ఫర్ అల్ అనే గ్రూప్ లో సభ్యుడు గా ఉన్నారు 
  • రాబర్ట్ F  కెన్నెది  ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అవర్డ్ (US ) మరియు అలంటి అవార్డులు ను స్పెయిన్ ఇటలీ , యూరోప్ నుండి తీసుకున్నారు. 
  • నోబెల్ బహుమతికి  యురోపియన్ గవర్నమెంట్ నోమినతే చేసింది. 
  • భారతదేశం పద్మ అవార్డు కూడా ఇవ్వలేదు (డర్టీ పిక్చర్ మూవీ హీరొయిన్ కి మాత్రం ఇస్తారు)
భారతదేశం నుండి ముగ్గురుకు శాంతి రంగం లో  నోబెల్ ప్రైజ్ వచ్చింది 
  • 1979 : మదర్ థెరెసా 
  • 2007:R K పచౌరి (IPCC  తరుపున)
  • 2014 : సత్యర్తి 
ఇప్పటివరకు ఇద్దరు పాకిస్తనియులుకు మాత్రమే నోబెల్ ప్రైజ్ వచ్చింది :
  • 1979: అబ్దుస్ సలాం (సబ్ అటామిక్ పార్టికల్ మిధ పరిశోదనకి)
  • 2014 : మలాల 

నోబెల్ ప్రైజ్ పొందిన చిన్న వయస్కురాలు (ఇంతక ముందు ఈ రికార్డు లారెన్స్ బ్రగ్గ్స్ -1915-భౌతిక శాస్త్రం మీద ఉంది )
మలాల : 
  • పాకిస్తాన్ లోని స్వాత్ లోయ ప్రాంతం కి చెందినా వ్యక్తి . 
  • ఆ ప్రాంతం లోని బాలికల  విద్య కోసం పోరాడుతుంది, తాలిబన్లు చేతిలో దాడికి కూడా గురిఐంది. 
  • I'm Malala, Malala:the girl who stood up for education and changed the world అనే పుస్తకాలు రాసింది
సాహిత్యం -2014:
  • పాట్రిక్ మోడిఅనో (ఫ్రాన్స్)
  • నాజిల దురాగతాల గురించి, రెండో ప్రపంచ యుద్ధం గురించి ప్రధానంగా రాసే నవల రచయత 
  • మిస్సింగ్ పర్సన్ : ఇతని ప్రముఖ రచన 
  • 2013 నోబెల్ బహుమతి ఆలిస్ మున్రో (కెనడా) కి లబించింది

Monday, 13 October 2014

Intelligence Bureau Recruitment 2014

Posts :           Asst Central Intelligence Officer Gr-II/ Executive Posts

No of Posts :   750 (UR-207 OBC-301,SC-180,ST-62)

Age Limit :  18 – 27  Years.(Age relaxation will be applicable as per rules).

Examination Fee : 100/- (No fee for SC,ST,Women Candidates)

Starting Date to apply Online : 11/10/2014

Last Date to apply Online : 09/11/2014 by 23:59 Hrs.







Saturday, 11 October 2014

Appsc Polity - Leader of Opposition (LoP) controversy

                16వ లోక్ సభ  లో ప్రధాన  ప్రతిపక్షనేత వివాదం 

భారత పార్లమెంట్ లో  ప్రధాన ప్రతిపక్ష నేత :

  • 1977 లో  ప్రధాన ప్రతిపక్ష నేత  పదివి కి చట్టబద్దత కలిపించారు . 
  •  ప్రతిపక్ష నేత కి కేబినేట్ మంత్రి కి ఉండే సౌకర్యాలు, జీతం మరియు హోదా ఉంటుంది 
  •  ప్రతిపక్ష నేత పార్లమెంట్ లో నిర్మాణాత్మక సూచనలు , సలహాలు ఇస్తారు
  •  ప్రతిపక్ష నేత పదివి చెప్పటడానికి ఒక రాజికియ పార్టీ కి సంబందిత సభ లో 10% మంది సభ్యులు ఉండాలి,
రాజ్యసభలో మొత్తం - 245 కావాల్సిన సంఖ్యా -25(10%) 
లోక్ సభ లో  మొత్తం - 543 కావాల్సిన సంఖ్యా -55(10%) 

ప్రస్తుత రాజ్యసభ   ప్రధాన ప్రతిపక్ష నేత - గులామ్ నభి ఆజాద్(కాంగ్రెస్) (కాంగ్రెస్ ఎమ్.పి ల సంఖ్యా-67) 
ప్రస్తుత లోక్ సభ    ప్రధాన ప్రతిపక్ష నేత - ఖాళీ  (కాంగ్రెస్ ఎమ్.పి ల సంఖ్యా-44) 

వివాదం కు కారణం :

  • లోక్ సభ లో కేవలం 44 సీట్లు మాత్రమే కాంగ్రెస్ కి వచ్చాయి .(10% కన్నా తక్కువ )
  • కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలుకు కలిపి 66 వచ్చాయి 
  • ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఒక పార్టీకి ఇస్తారు కాని కూటమికి కాదు 
  • అందువలనప్ర ధాన ప్రతిపక్ష నేత పదివి పొందడానికి కాంగ్రెస్ అర్హత సాదించలేక పోయింది 

వివిధ కమిటీ నిమయాకలలో ప్రధాన  ప్రతిపక్షనేత పాత్ర :

  •  సివిసి(CVC ) : 

    • ఎంపిక కమిటి సభ్యులు = ప్రధానమంత్రి+ప్రధాన ప్రతిపక్షనేత + హోం మంత్రి 
    •  ప్రధాన ప్రతిపక్షనేత పదివి ఖాళీగా ఉంటె  అప్పుడు ఒకే అతిపెద్ద పార్టీ నాయకుడు ఎంపిక కమిటి లో భాగం గా ఉండవొచ్చు అని 2003 సి వి సి చట్టం చెప్తుంది . 
    • కమిటీలో  ఖాళీ ఉన్నాసరే  నియామకం చేయవచ్చు అనికుడా   అదే చట్టంచెప్తుంది . 

  • సిఐసి(CIC ) : 

    • ఎంపిక కమిటి సభ్యులు =ప్రధానమంత్రి + ప్రధాన ప్రతిపక్షనేత + కేంద్రమంత్రి
    •  RTI చట్టం లో కూడా  లోక్ సభ లో  అతిపెద్ద పార్టీ నాయకుడు అని అన్నారు.

  • NHRC : 

    • ఎంపిక కమిటి సభ్యులు = ప్రధానమంత్రి+ప్రధాన ప్రతిపక్షనేత+హోం మంత్రి+లోక్ సభ స్పీకర్ + రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ 
    • మానవ హక్కుల రక్షణ చట్టం -1993 ప్రకారం కూడా కమిటీలో  ఖాళీ ఉన్నప్పటికీ  నియామకం చేయవచ్చు 

  •  లోక్ పాల్ : 

    • ఎంపిక కమిటి సభ్యులు = ప్రధానమంత్రి + ప్రధాన ప్రతిపక్షనేత  +లోక్ సభ స్పీకర్ +  ప్రముఖ  న్యాయ కోవిదుడు 
    •  లోక్ పాల్  చట్టం 2013 ప్రకారం కూడా కమిటీలో  ఖాళీ ఉన్నప్పటికీ  నియామకం చేయవచ్చు. 

  • నేషనల్ జ్యుడిసియల్ అప్పాయింట్మెంట్ కమిషన్ :

    • ఎంపిక కమిటి సభ్యులు =CJI + ఇద్దరు సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులు+ ఇద్దరు ప్రముఖ న్యాయకోవిదులు (ఇద్దరు ప్రముఖ న్యాయకోవిదులు  ను ప్రధానమంత్రి + ప్రధాన ప్రతిపక్షనేత   + CJI  లు ఎంపిక చేస్తారు )
    •  ప్రధాన ప్రతిపక్షనేత పదివి ఖాళీగా ఉంటె  అప్పుడు ఒకే అతిపెద్ద పార్టీ నాయకుడు కమిటిలో భాగం గా ఉండవొచ్చు అని NJAC  చట్టం చెప్తుంది . 

  • ప్రభుత్వ వాదన :

    • ప్రధాన ప్రతిపక్ష పార్టీ బలం మొత్తం సభ్యలలో 10% ఉండాలి అని  మొదటి లోక్ సభ స్పీకర్  జి.వి. మావలాంకర్అన్నారు, కావున ప్రధాన ప్రతిపక్ష నేత అర్హతకి 10% మంది సభ్యులు కావాలి .
    •  ఈ నియమం పార్లమెంట్  సౌకర్యాలు)చట్టం 1998 లో121 వ  డైరెక్షన్ లో కలదు  .

  • కాంగ్రెస్ వాదన : 

    •  ప్రతిపక్ష నాయకుడు జీతం, వసతలుకు సంబంధించి 1977-పార్లమెంట్ చట్టంలో ను  పేర్కొన్నారు 
    • దీని ప్రకారం  - అతి  పెద్ద పార్టీ నాయకుడు  ప్రధాన ప్రతిపక్షనేత  గా ఉంటారు