16వ లోక్ సభ లో ప్రధాన ప్రతిపక్షనేత వివాదం
భారత పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నేత :
- 1977 లో ప్రధాన ప్రతిపక్ష నేత పదివి కి చట్టబద్దత కలిపించారు .
- ప్రతిపక్ష నేత కి కేబినేట్ మంత్రి కి ఉండే సౌకర్యాలు, జీతం మరియు హోదా ఉంటుంది
- ప్రతిపక్ష నేత పార్లమెంట్ లో నిర్మాణాత్మక సూచనలు , సలహాలు ఇస్తారు
- ప్రతిపక్ష నేత పదివి చెప్పటడానికి ఒక రాజికియ పార్టీ కి సంబందిత సభ లో 10% మంది సభ్యులు ఉండాలి,
రాజ్యసభలో మొత్తం - 245 కావాల్సిన సంఖ్యా -25(10%)
లోక్ సభ లో మొత్తం - 543 కావాల్సిన సంఖ్యా -55(10%)
ప్రస్తుత రాజ్యసభ ప్రధాన ప్రతిపక్ష నేత - గులామ్ నభి ఆజాద్(కాంగ్రెస్) (కాంగ్రెస్ ఎమ్.పి ల సంఖ్యా-67)
ప్రస్తుత లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత - ఖాళీ (కాంగ్రెస్ ఎమ్.పి ల సంఖ్యా-44)
వివాదం కు కారణం :
- లోక్ సభ లో కేవలం 44 సీట్లు మాత్రమే కాంగ్రెస్ కి వచ్చాయి .(10% కన్నా తక్కువ )
- కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలుకు కలిపి 66 వచ్చాయి
- ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఒక పార్టీకి ఇస్తారు కాని కూటమికి కాదు
- అందువలనప్ర ధాన ప్రతిపక్ష నేత పదివి పొందడానికి కాంగ్రెస్ అర్హత సాదించలేక పోయింది
వివిధ కమిటీ నిమయాకలలో ప్రధాన ప్రతిపక్షనేత పాత్ర :
- సివిసి(CVC ) :
- ఎంపిక కమిటి సభ్యులు = ప్రధానమంత్రి+ప్రధాన ప్రతిపక్షనేత + హోం మంత్రి
- ప్రధాన ప్రతిపక్షనేత పదివి ఖాళీగా ఉంటె అప్పుడు ఒకే అతిపెద్ద పార్టీ నాయకుడు ఎంపిక కమిటి లో భాగం గా ఉండవొచ్చు అని 2003 సి వి సి చట్టం చెప్తుంది .
- కమిటీలో ఖాళీ ఉన్నాసరే నియామకం చేయవచ్చు అనికుడా అదే చట్టంచెప్తుంది .
- సిఐసి(CIC ) :
- ఎంపిక కమిటి సభ్యులు =ప్రధానమంత్రి + ప్రధాన ప్రతిపక్షనేత + కేంద్రమంత్రి
- RTI చట్టం లో కూడా లోక్ సభ లో అతిపెద్ద పార్టీ నాయకుడు అని అన్నారు.
- NHRC :
- ఎంపిక కమిటి సభ్యులు = ప్రధానమంత్రి+ప్రధాన ప్రతిపక్షనేత+హోం మంత్రి+లోక్ సభ స్పీకర్ + రాజ్యసభ డిప్యూటీ స్పీకర్
- మానవ హక్కుల రక్షణ చట్టం -1993 ప్రకారం కూడా కమిటీలో ఖాళీ ఉన్నప్పటికీ నియామకం చేయవచ్చు
- లోక్ పాల్ :
- ఎంపిక కమిటి సభ్యులు = ప్రధానమంత్రి + ప్రధాన ప్రతిపక్షనేత +లోక్ సభ స్పీకర్ + ప్రముఖ న్యాయ కోవిదుడు
- లోక్ పాల్ చట్టం 2013 ప్రకారం కూడా కమిటీలో ఖాళీ ఉన్నప్పటికీ నియామకం చేయవచ్చు.
- నేషనల్ జ్యుడిసియల్ అప్పాయింట్మెంట్ కమిషన్ :
- ఎంపిక కమిటి సభ్యులు =CJI + ఇద్దరు సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులు+ ఇద్దరు ప్రముఖ న్యాయకోవిదులు (ఇద్దరు ప్రముఖ న్యాయకోవిదులు ను ప్రధానమంత్రి + ప్రధాన ప్రతిపక్షనేత + CJI లు ఎంపిక చేస్తారు )
- ప్రధాన ప్రతిపక్షనేత పదివి ఖాళీగా ఉంటె అప్పుడు ఒకే అతిపెద్ద పార్టీ నాయకుడు కమిటిలో భాగం గా ఉండవొచ్చు అని NJAC చట్టం చెప్తుంది .
- ప్రభుత్వ వాదన :
- ప్రధాన ప్రతిపక్ష పార్టీ బలం మొత్తం సభ్యలలో 10% ఉండాలి అని మొదటి లోక్ సభ స్పీకర్ జి.వి. మావలాంకర్అన్నారు, కావున ప్రధాన ప్రతిపక్ష నేత అర్హతకి 10% మంది సభ్యులు కావాలి .
- ఈ నియమం పార్లమెంట్ సౌకర్యాలు)చట్టం 1998 లో121 వ డైరెక్షన్ లో కలదు .
- కాంగ్రెస్ వాదన :
- ప్రతిపక్ష నాయకుడు జీతం, వసతలుకు సంబంధించి 1977-పార్లమెంట్ చట్టంలో ను పేర్కొన్నారు
- దీని ప్రకారం - అతి పెద్ద పార్టీ నాయకుడు ప్రధాన ప్రతిపక్షనేత గా ఉంటారు
No comments:
Post a Comment