Monday, 20 October 2014

APPSC - Current Affairs - IRNSS , PSLV-C26 , GAGAN topics


IRNSS అంటే ఏమిటి ?
  • IRNSS  = ఇండియన్ రీజినల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టం 
  • భారత ప్రభుత్వం దీనిని 2006 లో 1500 కోట్ల బడ్జెట్ తో ఆమోదించింది 
  • దీనిలో 7 శాటిలైట్లు ఉంటాయి. ఈ 7 శాటిలైట్లు భూమి చుట్టు తిరుగతూ భారత దేశాన్ని దాని సరిహద్దులలో 1500 కి మీ వరకు పోజిసినింగ్ సేవలును అందిస్తుంది. 
  • అమెరికా గ్లోబల్ పోజిసినింగ్ సిస్టం (GPS ) లో 24 శాటిలైట్లు ఉండి, భూమి అంతటా పోజిసినింగ్ సేవలును అందిస్తుంది. 
  • బ్యాలలు (కర్ణాటక) లో ఉన్న ISRO నావిగేషన్ సెంటర్ నుండి  దీనిని నియంత్రిస్తారు. 
  • దీనిలో ఉన్న మొత్తం 7 శాటిలైట్లు మూడు భూ స్థిర కక్ష్య లో (geostationary Earth orbit or geosynchronouse quatorial orbit (GEO)), నాలుగు భూ అనువర్తిత కక్ష్యలో ప్రవేసపెడతారు.  ఒక కక్ష్య, భూమి నుండి చూసినప్పుడు  ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటె ఆ అలాంటి కక్ష్యని భూ స్థిర కక్ష్య అంటారు. ఈ కక్ష్య భూమధ్యరేఖ నుండి సరాసరి 36000 కిమీ ఉంటుంది.  
  • ఇండియన్ రీజినల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టం లో ఉండే 7 శాటిలైట్లు భూమి నుండి దాదాపుగా 36000కి మీ ఉంటాయి. 
  • 7 శాటిలైట్లులో  ఇప్పటివరకు 3 శాటిలైట్లు ప్రయోగించారు. 
  • తాజాగా కక్ష్యలోకి చేరిన ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1సి   పదేళ్లపాటు సేవలు అందిస్తుంది. 
  • 2015 నాటికి ఈ వ్యవస్థ సిద్ధమవుతుంది. 
  • IRNSS -1A :  
  1. వాహన నౌక (రాకెట్) : PSLV C-22 
  1. సంవత్సరం : 2013- జూలై 
  1. ప్రయోగ ప్రదేశం : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ - నెల్లూరు ఆంధ్ర ప్రదేశ్ 
  • IRNSS -1B  :  
  1. వాహన నౌక (రాకెట్) : PSLV C-24 
  1. సంవత్సరం : 2014-  ఏప్రిల్ 
  1. ప్రయోగ ప్రదేశం : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ - నెల్లూరు ఆంధ్ర ప్రదేశ్ 
  • IRNSS -1C :  
  1. వాహన నౌక (రాకెట్) : PSLV C-22 
  1. సంవత్సరం : 2014- అక్టోబర్ 16 (ఇస్రో మొదట సారి  PSLV-D2 ద్వారా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ను అక్టోబర్, 1994 నాడు ప్రయోగించింది)(ఉపగ్రహం = శాటిలైట్ )
  1. ప్రయోగ ప్రదేశం : సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ - నెల్లూరు ఆంధ్ర ప్రదేశ్ 
  1. ఉపగ్రహం బరువు : 1452 కే జి (APPSC పరిక్షల లో ఉప గ్రహమ్ బరువు ఎంత , విద్యాబాలన్ చివర సినిమా ఏది , హుదుద్ సైక్లోన్ లో ఎంత మంది చనిపోయారు లాంటి చిల్లర ప్రశ్నలు అడుగుతారు కావున జాబు వచ్చే  వరుకు ఇలాంటి డేటాని బట్టి కొట్టాలిసిందే)
  1. దీనిలో రెండు పే లోడ్లు కలవు- a) వినియోగాదారులుకు నావిగేషనల్ సిగ్నల్ పంపడానికి ఉపయోగపడే పరికరం b) సైనికులుకు ఉపయోగపడే లేసర్ రెంజింగ్ కి వాడే C-బ్యాండ్ ట్రాన్స్ పండర్లు. 
IRNSS   ఉపయోగాలు : 
  • ఐఆర్ ఎన్ ఎస్ ఎస్ వ్యవస్థ భూతల, ఆకాశ, సాగరాల్లో దిశానిర్దేశ సేవలను అందిస్తుంది. విమానాలు, ఓడల గమనాన్ని నిర్దేశించడంలో సాయపడుతుంది.
  • ప్రతి ఒక్కరు కి ఉపయోగపడే స్టాండర్డ్ పోజిసినింగ్ సేవాలు 
  • కేవలం సైన్యం మరియు ప్రభుత్వం మాత్రమే వాడ గల నియంత్రిత సేవలును అందిస్తుంది(Restricted Services)
  • అమెరికన్ GPS 10 మీటర్ల ఖచితత్వం తో పనిచేస్తే, IRNSS 15 మీటర్ల ఖచితత్వం తో పనిచేస్తుంది. 
  • వివిధ రకాలైన సెల్ ఫోన్ అప్ప్స్ లో వాడుతున్నారు (డ్రైవింగ్ , దారులు తెల్సుకోవడం లో )
  • అడవలలో రేగే కార్చిచ్చు, అంతరించి పోయే జంతు జాతులును తెల్సుకోడానికి 
  • విపత్తు నిర్వహణలో ఉపయోగ పడ్తుంది 
మనం ఇప్పటివరకు అమెరికా కి చెందిన GPS ని , రష్యా కి చెందిన GLONASS ని వినియోగిస్తున్నం.

ఇప్పటికే GPS,GLONASS ఉండగా ఈ IRNSS  గొడవ ఎందుకు??

మనం తరుచూ వినే క్షిపణులు సుదూరం లో ఉండే తమ లక్ష్యాలును చేరుకోడానికి GPS/GLONASS వాడుతాయి,
అంటే GPS/GLONASS లు చెప్పే దారిలో  మన క్షిపణులు  ప్రయాణిస్తాయి అవి తప్పు చెప్తే అవి తప్పుడు గమ్యాన్ని చేరుకుంటాయి. పాకిస్తాన్ తో యుద్ధం వస్తే తన మిత్ర దేశం అమెరికా, తన GPS ద్వారా తప్పుడు సంకేతాలు ఇస్తుంది, అదే విదంగా చైనా తో యుద్ధం వస్తే తన మిత్ర దేశం రష్యా GLONASS ద్వారా తప్పుడు సంకేతాలు ఇచే ప్రమాదం ఉంది. అందు వలన మన దేశం కూడా సొంత నావిగేషన్ సిస్టం ని ఏర్పాటు చేసుకుంటుంది.

వివిధ దేశాల  నావిగేషన్ సిస్టంల పేర్లు : 
  • అమెరికా : GPS ( రీడర్ కామెంట్ : ఆర్టికల్ ప్రారంబం నుండి ఈ పేరు తో చాచిపోతున్నాం రా బాబు )
  • రష్యా : GLONASS 
  • చైనా : Beidou 
  • యూరోప్ : గెలీలియా
  • జపాన్  : క్వాసీ-జెనిత
  • భారత్ : IRNSS 
PSLV C-26 : 
  • పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్- సి26 పీఎస్ఎల్‌వీ శ్రేణిలో 28వ వాహక నౌక. ఎక్స్ఎల్ వెర్షన్‌కు సబంధించి ఇది 7వ ప్రయోగం. ఇప్పటివరకు 28 పీఎస్ఎల్‌వీలను ప్రయోగించగా, మొదటి ప్రయోగం తప్ప మిగతా 27 విజయవంతమయ్యాయి.
  •  తాజాగా నింగిలోకి వెళ్లిన పీఎస్ఎల్ఎల్‌వీ పొడవు 44.4 మీటర్లు. బరువు 320 టన్నులు. 
  • ఇందులో నాలుగు దశలు ఉండగా ఒకటి, మూడు దశల్లో ఘన ఇంధనం, రెండు, నాలుగు దశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించారు. పీఎస్ఎల్‌వీకి రూ.100 కోట్లు, ఐఆర్ఎన్ఎస్ఎస్ - 1సి ఉపగ్రహానికి రూ.142 కోట్లు వ్యయం చేశారు. 

GAGAN (Global Positioning System Aided Geo Augmented Navigation System ) : 
  • విమానయాన రాకపోకల నియంత్రానికి మరియు  సమన్వయానికి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా మరియు ఇస్రో  ఒక జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రకిటించారు 
  • ఇది అమెరికా కి చెందిన గ్లోబల్ పోజిసినింగ్ సిస్టం మిధ పడ్తుంది . 
  • దీని కోసం 2011 మే లో ఒక పే లోడ్ ని GSAT -8 లో ప్రయోగించారు. 

No comments:

Post a Comment