Sunday, 2 November 2014

APPSC-Current Affairs : Din Dayal Antyodaya Yojana


దిన్ దయాల్ అంత్యోదయ యోజన ఎందుకు (DAY)?

  • పట్టణాలలో పల్లెలలో యువతకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి, (--> నిరుద్యోగం పోతుంది--> పేదరికం పోతుంది). 
  • అభివృద్ధి చెందిన దేశాలలో 2020 నాటికి 57 మిలియన్ శ్రామికల కొరత ఉంటుంది. కావున విదేశి కంపెనీలు ఈ శ్రామికలును వేరేదేశాలునుండి తెచుకోవలిసి ఉంటుంది.  
  • అందువలన మోడీ విదేశి కంపెనీలును భారత దేశం లో తమ ఉత్పత్తులును చేయమంటున్నాడు- "మేక్ ఇన్ ఇండియా" , కాని  విదేశి కంపెనీలుకు క్రింది సౌకర్యాలు కావాలి. 
    1. విదేశీయులు వ్యాపారాన్ని సులభతరం చేయడం.(ఉదా : అనుమతులు కోసం లంచాల లేకపోవం లాంటివి).
    2. స్తిరమైన పన్నుల విదానం.
    3. నైపుణ్యమైన మరియు చవకైన శ్రామికలు . (2020 నాటికీ ఇండియాలో 47 మిలియన్ శ్రామిక జనాబా ఉంటుంది).
  • ప్రతిసంవత్సరం 12 మిలియన్లు మంది కొత్తగా  శ్రామిక జనాబా తయారు అవుతుంది. వీరిలో 10% మంది మాత్రమే నైపుణ్యం గల శ్రామికులు, వీరు యురోపియన్ యూనియన్ లో 70%,చైనా లో 50% గా ఉన్నారు 
  • "మేక్ ఇన్ ఇండియా" విజయవంతం కావాలి అంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన అవసరం అని  పై విషయాలు ద్వారా తెలుస్తుంది. 
పధకం యొక్క వివరాలు 
 గ్రామీణ ప్రాంత యువకులు ఆకలి రాజ్యంలో హీరోలా ఆకలి బాధలు పడకుండా ఉండటానికి. 
ఎవరు?

  • గ్రామీణ ప్రాంతం: రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ.  
  • పట్టణ ప్రాంతం:మినిస్ట్రీ అఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ పోవేట్రీ  అల్లెవేసన్(పట్టణ గృహ నిర్మాణ మరియు పేదిరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ) 
ఎప్పుడు?
  • 2014, సెప్టెంబర్ నాడు దీని ప్రారంబించారు. సెప్టెంబర్ 25 నాడు అంత్యోదయ దివస్ ను జరుపుకోవాలి అని ప్రభుత్వం ప్రకటించింది. 
  • గ్రామిణ ప్రాంతాలలో : 2014 నుండి ప్రారంబం.
  • పట్టణ ప్రాంతాలలో : 2016 నుండి .
ఎందుకు?గ్రామిణ మరియు పట్టణ యువతకి నైపుణ్యం తో కూడిన శిక్షణ ఇవ్వడం. 

S1: గ్రామీణ దీన్ దయాల్ 

IF POOR FARMER “BHUVAN” DOESN’T WANT TO PAY LAGAAN, HE BETTER GET SKILL TRAINING & CHANGE PROFESSION
అధికారిక పేరు 
  • దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీన్ కౌశల్య యోజన. 
  • SGSY=> NRLM => అజీవిక.
  • ఆజీవిక లో నైపుణ్య అభివృద్ధి ఒక బాగంగా ఉంది, దీనిని దీన్దయాల్ ఉపాద్యాయ గ్రామీణ్ కౌసల్య యోజన. 
ఎవరికోసం 
  • 15 సంవత్సరాల నుండి ఉండే గ్రామీణ ప్రాంత యువకలుకు. 
  • ఇంతకముందు 18 సంవత్సరాలు ఉండే యువకులుకు.
లక్ష్యం 
  • 2017 నాటికి 10లక్షల మంది యువకలుకు శిక్షణ.
  • గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్య అభివృద్ధి కేంద్రలును ఏర్పాటు చేయడం. 
  • శిక్షణ ఇచ్చే సిలబస్ అంతర్జాతీయ ప్రమాణాలుకు తగ్గట్టు తయారు చేసి, వాటిలో శిక్షణ ఇవ్వడం దీనివలన "మేక్ ఇన్ ఇండియా" భారతదేశం లో ఉండే విదేశ పరిశ్రములలో పని చేసే అవకాశం ఉంటుంది. 
  • వికలాంగులుమీద  ప్రత్యేకమైన శ్రద్ద కనపరుస్తారు.

S2: పట్టణ దీన్ దయాల్ 

అదికారనామం దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన 
ఎవరికోసం పట్టణ పేదలుకు 
లక్ష్యం ప్రతి సంవత్సరం 5 లక్షల మందికి శిక్షణ

దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన 

  1. పది లక్షలతో పట్టణ ప్రాంతాలలో జీవనొపది కేంద్రాలు ఏర్పాటు చేయడం.
  2. ప్రతి పట్టణ పేద వ్యక్తికి ఈ కేంద్రాలు ద్వారా శిక్షణ ఇవ్వడం.ప్రభుత్వం ఒక్కొకరిపైన 15-18 వేలు శిక్షణ కోసం ఖర్చుపెడుతుంది. ప్రతి సంవత్సరం 5 లక్షల మందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యం. 
  3. పట్టణ స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేయడము . వాటిని బ్యాంక్లు తో అనుసందిచడం. ఒక్కో గ్రూప్ కి 10,000/- ఇస్తారు. 
  4. వెండర్ మార్కెట్ లు ఏర్పాటు చేయడం.(వెండర్ = అమ్మకందారుడు), అమ్మకం దారులుకు కూడా శిక్షణ ఇవ్వడము. 
  5. ఇండ్లు లేని పట్టణ పేదలికి ఇల్లు నిర్ముంచట మరియు కనీస సౌకర్యాలు కల్పించుట. 
  6. పేదలు పరిశ్రమలు పెట్టేటట్టు ప్రోత్సహించుట. వారికి 7% వడ్డీకి ఋణం ఇచ్చుట.  
పరిశ్రమ వడ్డీ సబ్సిడీ 
ఒక్కో వ్యక్తి ఏర్పాటు చేసే సూక్ష్మ పరిశ్రమ Rs. 2 lakh
బృందంగా ఏర్పడి ఏర్పాటు చేసే పరిశ్రమ Rs. 10 lakh

NSDC తో దీన్ దయాల్ ఒప్పందం 

  •  నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ)(NSDC) తో పట్టణ గృహ నిర్మాణ మరియు పేదిరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ MoU కుదుర్చుకుంది. 
  • మార్కెట్ అవసరాల ప్రకారం జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ పేద యువతకి శిక్షణ ఇస్తుంది 
  • జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ - లబ్దిదారులును గుర్తిస్తుంది, మరియు సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ద్వారా శిక్షణ ఇస్తుంది 
  • సెక్టార్ స్కిల్ కౌన్సిల్ : పరిశ్రమల నేతృత్వంలోని సంస్థలు. ఒక పారశ్రామిక విబాగం కి సంబంధించి వాటికి కావలిసిన సిలబస్ మరియు స్టాండర్డ్స్ ను నిర్ణయిస్తుంది. 

NRLM and NULM

ఈ రెండిటి మద్య తేడాలు 
NRLMNRUM
పూర్వ నామం : స్వర్ణజయంతి గ్రామ్ యోజన(SGSY).పూర్వనామం:స్వర్ణజయంతి సహరి స్వరోజ్గార్ యోజన. 
నేషనల్ రూరల్ లైవ్లిహుడ్ మిషన్ గా పేరు మార్చారు. నేషనల్ అర్బన్ లైవ్లిహుడ్ మిషన్ గా పేరు మార్చారు. 
చివరిసారి ఆజీవికగా పేరు మార్చారు. ----(మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అని పేరు మార్చలేదు కావొచ్చు)
గ్రామీణ అభివృద్ధి శాఖా మంత్రిత్వ శాఖాపట్టణ గృహ నిర్మాణ మరియు పేదిరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ
  • ప్రతి ఇంటి నుండి ఒక వ్యక్తిని స్వయం సహాయక బృందంలో చేర్పించి బ్యాంకు రుణాలు+సబ్సిడీ+శిక్షణ ఇప్పించి తద్వారా ఆదాయాన్ని సంపాదించేటట్టు చేయడం.
  •  దీనిలో బాగంగా  "ఆజీవిక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం"  ఉండేది. దీనిపేరు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన 
  • వీది వ్యాపారులుకు సులబతరంగ రుణాలు అందిస్తారు. 
  • గృహాలులేని వారికి అవాసాలు కల్పించుట.
ఎకనామిక్ సర్వే:
  • అగర్బత్తి,కుండల తయారి లాంటి చిన్న  వ్యాపారులులో ఆజీవిక మంచి ఫలితం కనపర్చినది.
  • కాని ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి వ్యాపార కార్యకలాపాలు పెంచడం మీద దృష్టి పెట్టలేదు.
ఆజవీక: బడ్జెట్-2014
  • కొన్ని వెనుకబడిన జిల్లాలో మహిళా స్వయం సహాయక బృందాలుకు తక్కువ వడ్డీ రెట్లుకి ఋణాలు ఇస్తారు. 
  • 2014 బడ్జెట్లో వెనుకబడిన జిల్లాల సంఖ్య పెంచారు. 
వడ్డీ రేట్  2014 బడ్జెట్ ముందు తరువాత 
4%150 వెనుకబడిన జిల్లాలు 250
7%మిగతా జిల్లాలు మారలేదు  (7%)
దీనికి అదనంగా గ్రామీణ యువతకి  "స్టార్ట్ అప్ ఎంటర్ప్రేనుర్శిప్ ప్రోగ్రాం" ని 2014 బడ్జెట్లో ప్రకటించారు.  

Tuesday, 28 October 2014

Combined Higher Secondary Level (10+2) Examination, 2014 HallTickets

Exam Dates: 2nd, 9th November

Click here for Hallticket  (This link is only for Southern Region)

Saturday, 25 October 2014

APPSC CURRENT AFFAIRS : WORLD HUNGER REPORT


ప్రపంచ ఆకలి నివేదిక, బాలల పోషకార లోపం  

ఏమిటి?ప్రపంచ ఆకలి సూచీ విడుదల
ఎవరు? అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనా సంస్థ (IFPRI), అంతర్జాతీయంగా ఆహార భద్రత గురించి ఆలోచించే సంస్థ
ఎప్పుడు  అక్టోబర్  2014

భారతదేశం యొక్క ర్యాంకు :
201363rd
2014
  • 76 దేశాలలో 55 స్థానం 
  • బంగ్లాదేశ్ మరియు పాక్ కన్నా మెరుగైన స్థానం
  • నేపాల్, శ్రీలంక కన్నా వెనుకబడి ఉన్నాము.

మూడు  అంశాలు ఆధారంగా ప్రపంచ ఆకలి నివేదిక తయారు చేసారు  (ముడింటీకి సమాన భారం కలదు)
అంశం భారత దేశం 
అల్ప బరువు గల పిల్లలు 
  • 2005:  మొత్తం పిల్లలలో ~45%
  • 2013: మొత్తం పిల్లలలో~31% (45% నుండి 31% కావున తగ్గింది)
పోషకాహార లోపంతో బాదపడుతున్న పిల్లలు 
  • 2004-06: ~22%
  • 2011-13: 17% ( ఇది కూడా తగ్గింది)
5సంవత్సరలు కన్నా తక్కువ వయుస్సు గల శిశుమరణాల
  • 2005: ~8%
  • 2014: ~6% ( ఇది కూడా తగ్గింది)
భారతదేశం యొక్క పురోగతి
అల్ప బరువు తొ బాద పడేవారి సంఖ్య / పోషకాహారలోపాం తొ బాధ పడే వారి సంఖ్య తగ్గింది.ప్రధానంగా ఎంజిఎన్ఆర్ఇజిఎ, ఎన్ఆర్హెచ్ఎం, ఐసీడీఎస్ మరియు ఇతర ఇలంతి పథకాలు కారణంగా ఈ పురొగతి సాదించగిలిగాం. ఆర్థికంగా శరవేగంగా వృద్ది చెందుతున్న బ్రెజిల్ మరియు చైనా లాంటి  దేశాలు సామాజిక సంక్షేమ పథకాలకు పెట్టుబడులను పేంచడం ద్వార అధిక వేగముతొ  పోషకాహారలోపామ్ను అదిగమిస్తూన్నాయి,
  1. అల్ప బరువుతొ బాద పడేవారి సంఖ్య / పోషకాహారలోపాంతొ బాధపడే వారి సంఖ్య తగ్గింది.ప్రధానంగా due to MNREGA, NRHM, ICDS మరియు ఇతర ఇలాంటి పథకాలు కారణంగా ఈ పురొగతి సాధ్యపడింది .
  2. ఆర్థికంగా శరవేగంగా వృద్ది చెందుతున్న బ్రెజిల్ మరియు చైనా లాంటి  దేశాలు సామాజిక సంక్షేమ పథకాలకు పెట్టుబడులను పెంచడం ద్వారా అధిక వేగముతొ  పోషకాహారలోపమును అదిగమిస్తూన్నాయి.
ఈ నివేధక ప్రకారం భారతదేశం  పోషకాహారలోపం  నిర్మూలనలొ మంచి ఫలితాలు సాదిస్తున్నట్టేనా?
  1. భారతదేశపు వృద్ధి రేటు పోలిఉన్న ఇతర దేశాలు తమ గ్లొబల్ హంగర్ ఇండెక్ష్ ను(ప్రపంచ ఆకలి నివేదిక)  గత ఎడాది కన్నా సుమారు 55%  పెంచుకున్నాయి. ఉదాహరణకు వెనిజులా, మెక్సికో, క్యూబా, ఘనా, థాయిలాండ్ మరియు వియత్నాం.
  2. యునిసెఫ్ నివేధక ఆదారంగా ఈ నివేదిక  తయారు చెయబడింది. యునిసెఫ్ తన నివేదకను మన దేశపు కుటంబ ఆరొగ్య శాఖ నుండి తీసుకొని తయారు చేసారు. ( కావున ఈ డెటా ఎంత వరకు సరైనిదొ తెలియదు)
  3. ఇదివరకు వెలువడిన మరోనివేదకతో ఈ సర్వే యొక్క  ఫలితాలు విబేదిస్తున్నాయి. 
  4. రాష్ట్రాల మద్య అంతరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 
  5. అల్ప బరువుతొ బాదపడుతున్న 5 సంవత్సరాలలోపు  పిల్లలు మన దేశంలొనే 70% కలరు.
  6. 70% మంది భారతదేశ పిల్లలు  రక్తహీనతతో బాదపడుతున్నారు.
  7. వీటికి అదనంగా  నిగూడఅకలి(హిడెన్ హంగర్) భారతదేశాన్ని వేదిస్తున్నది. 

నిగూడ ఆకలి (హిడన్ హంగర్) అంటె ఏమిటి ?

  • భారతదేశంలొ చాలా మంది, ప్రభుత్వం ఇచ్చే గొదమ లేదా వరి సబ్సిడి వలన రొజూ వీటినే  తమ ఆహరంగా   తీసుకొంటున్నారు, వీటిలొ ఉండె కార్బొహైడ్రెటెస్ వలన అకలి తిరుతుంది గాని శరిర పెరుగదలకి కావలసిన ప్రొటిన్లు, ఖనిజాలు లాంటి పొషకాలు లబించవు, ఇలాంటి స్థితినే నిగూడఆకలి(హిడన్ హంగర్) అంటారు,ప్రపంచంలొ ప్రతి ముగ్గురులొ ఒకరు ఇలాంటి ఆకలితొ బాదపడుతున్నారు . 
నిగూడ ఆకలి ఎందుకు ఉత్పన్నం అవుతుంది?
  • పేదరికం వలన, సరైనఅవగాహాన లేకపోవడం వలన బాలబాలికలు తమ కౌమార దశలో, గర్బీణి స్త్రీలు అధిక పోషక విలువులుగల ఆహారాన్ని తిసుకోలెకపోతున్నారు 
  • పరిష్కారం: అయోడిన్ కలిపిన ఉప్పు, PDS సంస్కరణలు,ఆహార అలవాటులుపైన సరైన అవగాహన కల్పించుట.
నిగూడ ఆకలి (Global hunger report ప్రకారం)
అయోడిన్ లోపం 25%
అనీమియా తో బాధపడే గర్బినీలు 54%
5 సంవత్సరాల లోపు పిల్లలో అనీమియా59%
విటమిన్ A లోపం 62%

India Newborn Action Plan (INAP)


భారతదేశపు నవజాత( Newborn) యాక్షన్ ప్లాన్ 
ఎప్పుడు?2014, సెప్టెంబర్
ఎవరు?కేంద్ర ఆరోగ్య శాఖ
ఎందుకు 
  • భారతదేశంలో ప్రతి సంవత్సరం7లక్షల మంది నవజాత శిశువులు మరణిస్తున్నారు. 
  • ప్రస్తుతం, శిశు మరణాల రేటు: 1000 మందికి 29 మంది మృత్యవాత పడుతున్నారు
ఏమిటి?
  • లక్ష్యం: 2030 నాటి శిశు మరణాలును ఒక అంకె కి తిసుకురాడము. (అనగా  1000 మందికి 9 కన్నా తక్కువ).
ఎలా?
  • Reproductive, Maternal Child Health and Adolescent Plus (RMCHA+)  ఫ్రేంవర్క్ ని అములు చేయడం ద్వారా. 
  • 6 కార్యాచరణ ప్రణాళికలు ద్వారా 

6 strategies of INAP
  1. ప్రసవపూర్వ సంరక్షణ ద్వారా 
  2. శిశువు జన్మిస్తున్నప్పుడు
  3. శిశువు జన్మించిన వెంటనే 
  1. ఆరోగ్యవంతమైన శిశువు సంరక్షణ 
  2. అనారోగ్యం తో బాదపడుతున్న శిశువు సంరక్షణ
  3. శిశువు ఎదుగుతన్న సమయంలో సంరక్షణ.
పైన చర్యలే కాకుండా ఆశా కార్మికులు, ఇండియన్ అకాడమీ అఫ్ పీడియాట్రిషన్స్ మరియు స్వంచంద సంస్థలు సహాయం పొందడం ద్వారా. 

నేషనల్ న్యూట్రిషన్  (పోషకత్వ) మిషన్

ఎప్పుడు?2014, జనవరి
ఎవరు?ఆరోగ్య శాఖ
ఎందుకుమహిళలో మరియు మూడు సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలలో  పోషకాహారలోపం తగ్గించడానికి:
తీవ్ర పోషకాహారం  లోపంతో బాదపడుతున్న 200  జిల్లాలో  ప్రారంబం. 
విమర్శదీని ద్వారా ఒక ఫలితం కూడా ఇప్పటివరుకు రాలేదు
ఎలా?జిల్లా స్థాయిలో అంగన్వాడీ  కార్మికలుకు   శిక్షణ ఇవ్వడం ద్వారా
పర్యవేక్షణ పురోగతి కోసం ఈఛ్ట్: అంగన్వాడీ కార్మికులు టాబ్లెట్ / మొబైల్ ఉపయోగించి పిల్లల డేటా సేకరించడానికి.

ICT పర్యవేక్షణ చేయడం ద్వారా.

 RBSK మరియు  WIFS

RBSKWIFS
  • రాష్ట్రీయ బాల్ స్వస్త్య కార్యక్రమం
  • అప్పుడే పుట్టిన శిశువు నుండి 18 ఏళ్ళు ఉన్న యువకులులో పరిక్షించడం  – పుట్టుక నుండి ఉండే లోపాలు, వ్యాధులు,పెరుగుదల లోపాలు పరిక్షించడం
  • అంగనవాడి కేంద్రాలు మరియు స్కూల్స్ ద్వారా ఈ పరిక్షలు నిర్వహిస్తారు. 
  • వీక్లీ ఐరన్ ఫోలిక్ ఆసిడ్ సప్లిమేంటేసన్ 
  • ప్రతి వారం బాలికలుకు ఫోలిక్ ఆసిడ్ మాత్రలు ఇవ్వడం ద్వారా అనీమియాని దూరం చేయడం.
ఇంకో సమస్య ఏమిటి?
  • మద్యహ్నబోజన పదకం ద్వారా లబ్ది పొండుతున్నవారి కన్నాపై పధకాలు ద్వారా లబ్ది పొందుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది, అంటే దీని అర్థం - చాలా మందికి ఈ పధకాలు చేరట్లేదు అన మాట. 
  • సర్వ శిక్ష అభియాన, మిడ్ డే మీల్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ కింద వీటిని అములు చేయాలనీ రాష్ట్రప్రభుత్వాలని కేంద్ర మనవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కోరింది. 
శిశు మరియు మాతృ మరణాలు తగ్గడానికి తీసుకున్న ఇతర చర్యలు: 
అంతర్జాతీయ
  • 2014 జూన్: 2035 నాటికి అప్పుడే పుట్టిన శిశు మరణాలని సున్నాకి తగ్గించాలి అని వరల్డ్ హెల్త్ అర్గనైజేసన్, UNICEF లు తిర్మనించాయి
ప్రసవము

  • క్రమం తప్పకుండా ఆరోగ్య పరిక్షలుకు వెళ్ళే, సరైన ఆహారం, మందులు తీసుకునే గర్బిణిలుకు ప్రుభుత్వం ఆర్థిక సౌకర్యం మరియు హెల్త్ సెంటర్ లు వరుకు ఉచిత రవాణ సదుపాయం కలిగిస్తుంది. 
  • ఆశ కార్మికులు ద్వారా కుటంబ నియంత్రణ ప్రయోజనాలని తెలియపరుస్తున్నారు. 
భవనాలు 
  • జిల్లాకు 3 నుండి 4 చొప్పన మొత్తం 1400  అప్పుడే పుట్టిన శిశువు కేంద్రాలు ఏర్పాటు
  • అత్యవసర పరిస్తితులుకు - ~550 ప్రత్యేక అప్పుడే పుట్టిన శిశువు కేంద్రాలు
ASHA(ఆశ)తల్లిపాల గురించి , పరిశ్రుబ్రం గురించి తల్లుల్లో అవగహన కలిపించడం. 

 PNDT మీద నిపుణల కమిటి

ఎవరు?ఆరోగ్య శాఖ 
ఏమిటి?
  • మంత్రి ఒక నిపుణల కమిటి వేసారు. 
  •  కొత్త పద్దతులు ద్వారా తల్లి గర్బంలో ఉన్న శిశువు  లింగనిర్ధారణ పరిక్షలు జరుపుతున్నారు, ఈ పద్దతులు ద్వారా ఇప్పుడు ఉన్న చట్టం  నుండి తప్పించుకోనుచున్నారు. దీనిని ఈ పద్దుతులును పరిశిలించి చట్టం లో తగిన మార్పులు సూచించడానికి ఉద్దేశించబడింది ఈ కమిటి  
  • PNDT= Pre Conception and Pre Natal Diagnostic Techniques Act, 1994.
But why do we need to review PNDT act?
జనాబా లెక్కలు చైల్డ్ సెక్స్ రేషియో 
1971964/1000
2011918/1000
  • 1994 లో  ప్రీ కన్సేపసన్, ప్రీ నాటల్ డైగ్నోస్తిక్ టెక్నిక్స్ చట్టం చేయబండింది, కాని చైల్డ్ సెక్స్ రేషియో పెరగలేదు. 
  • అతి ధ్వనులు ఉపయోగించి లింగ నిర్ధారణ చేయడంను PNDT చట్టం ద్వారా నిషేదించారు
  • ప్రస్తుతం తెలివిమీరిపోయిన డాక్టర్లు జన్యు లోపాలు తెల్సుకోడానికి అంటూ లింగ నిర్దారణ పరిక్షలు చేస్తున్నారు ఇది చట్ట వ్యతిరేకం. 
  • కావున PNDT చట్టంలో మార్పులు అవసరం ఐంది.
ఇతర అంశాలు:
  1. ఈ చట్టంను మెరుగ్గా అములు పరచాలి అని ప్రభుత్వాన్ని  సుప్రీం కోర్ట్ కోరింది.
  2. "బేటి బచావు బేటి పడావు" పధకం  కింద  గుజరాత్ మహారాష్ట్ర  హర్యానా పంజాబ్ లో 100 జిల్లలును ఎంపిక చేసారు.

Friday, 24 October 2014

APPSC Material - News

నిరాశలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఉద్యోగార్థులు :

కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి, కొత్త ప్రభుత్వాలు కొలివితీరి నెలలు గడుస్తన్నాయి కాని ఇప్పటి వరకు గ్రూప్-1 మరియు గ్రూప్-2 నోటిఫికేసన్ విడుదల గురించి స్పస్థత లేదు,కొన్నిలక్షమంది విద్యార్థులు ఉద్యోగప్రకటనలు కోసం రెండు సంవత్సరాలు నుండి ఎంతో  ఆశతో ఎదురుచూస్తున్నారు, ఆ ఎదురుచూస్తున్న విద్యార్థులు కాస్తా నిరుద్యోగులుగా మారిన  దుస్థితి మన పాలకులు తీసుకోచ్చారు,ఇలా ఎదురుచూస్తున్న వారిలో చాలామంది మారుమూల  గ్రామీణ ప్రాంతాలు నుండి, ప్రభుత్వ బడులలో తెలుగు మీడియం చదివిన విద్యార్థులు, కటిక పేదిరికం నుండి వచ్చిన వారు అదికంగా ఉంటారు, వీరు కోచింగ్ సెంటర్స్లో ఫీజు కట్టలేక, మహా నగరాలలో హాస్టల్ ఫీజు బారం మోయలేక కన్నీళ్లను  దిగమింగుకుంటూ, పస్తులు ఉంటూ,రోజులు తరబడి పుస్తకాలుతో సహవాసం చేస్తూ, తమ లక్ష్యాన్ని తలుచుకుంటూ అనుక్షణం తమ గమ్యాన్ని చేరుకొనేందుకు  ప్రయత్నిస్తున్నారు,  తమ బిడ్డ తొందర్లోనే మంచి ఉద్యోగం సంపాదిస్తాడు అనుకొనే తల్లిదండ్రుల ఆశలును, విద్యార్థుల శ్రమను  సర్కారు నీరుగారిస్తుంది, ఎందకంటే ఇలా చదవే అనేక మంది పేద వారు కాబట్టి, వాళ్ళు తమ నిరసనను బలంగా తెలపలేరు కాబట్టి, పాలక ప్రతిపక్షాలుకు వారు కేవలం వోటర్లు మాత్రమే కాబట్టి, ఒకవేళ నిరసన  తెలిపితే పోలీసులుతో పాసవికంగా వారి గొంతు నోక్కేస్తారుఅదే బడా పారిశ్రామిక వేత్తలుకు చెందిన భూమి వ్యవహారాలు, పోర్ట్లు, కంపని వ్యవహారాలు  అయితే ఆగమేఘాలు మీద  పనులు జరుగుతాయి
చివరసారి పరిక్షలు  2012లో నిర్వహించారు తరువాత 2013లో సంవత్సరికా పట్టిక ను విడుదల చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిసన్ తరహాలో ప్రతి ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని పబ్లిక్ సర్వీస్ కమిసన్ ర్బటంగా ప్రకటించింది , కాని కొత్త రాష్ట్రము  ఏర్పడే ప్రక్రియలో,  నోటిఫికేషన్ విడుదలకు  సంబంధించి రాష్ట్రప్రభుత్వంతో ఉత్తరప్రత్యోత్తరాలు జరిపి  నోటిఫికేషన్ విడుదల చేయకుండా పేద వాళ్ళ బంగారు కలను చిదిమేసే ప్రయత్నం చేసింది, రాజ్యంగబద్దంగా ఎర్పడ్డ  సంస్థ ఐన పబ్లిక్ సర్వీస్ కమిసన్  నోటిఫికేషన్ విడుదల విషయంలో తమ ఇష్టప్రకారం  వెల్లవొచ్చు అని అప్పటి ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం చెప్పినా, పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఏమి చేయకుండా సుప్తావస్థ స్థితిలో ఉండిపోయింది ఉత్తరప్రత్యోత్తరాలు జరిపి సంవత్సరం దా టిపోయింది, కానీ ఇప్పటి వరుకు నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి గాని, కనీసం పరీక్షా విధానంలోగాని, సిలబస్లో మార్పులు గురించి గాని ఎలాంటి ప్రకటన లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన గురిఅవుతున్నరు. ఆందోళన ప్రభుత్వవ్యతిరేకఆందోళన, పేద ప్రజల ఆకలి కేకల ఆందోళనగా మారక ముందే ఏలుకులు చొరవతీసుకోని, గ్రామీణ విద్యార్థ ల బ్రతుకలలో ఉద్యోగ వెలుగులు నింపుతారు అని ఆశిద్దాం!!!!

Wednesday, 22 October 2014

APPSC CURRENT AFFAIRS IN TELUGU

OCTOBER -2014

APPSC CURRENT AFFAIRS : NISAR 2020, GSLV-MK-3, GSAT-16 and LAM

                                              నిసార్ 



NISAR అంటే ఏమిటి ?


పూర్తి పేరు NASA-ISRO Synthetic Aperture Radar (NISAR) mission
ఎప్పుడు ప్రయోగిస్తారు 2020

ఈ మిషన్ వలన  ఉపయోగం ఏమిటి  ? 

  • భూమి మిధ ఉండే భూ తలం , హిమ తలం , హిమశికరాలు , అగ్ని పర్వతాలు , భూ కంపాలలో వచ్చే మార్పులును అద్యననం చేస్తుంది 
  • ఆ మార్పులుకు గల కారణాలును , వాటి వాళ్ళ సంబవించే పరిణమాలును అంచనా వేస్తుంది. 
  • ఇది L - బ్యాండ్ మరియు S బ్యాండ్ లను వినియోగించడం వలన భూమిని ఒక సెంటీమీటర్ రేజల్యుసన్ తో చిత్రికరించగలదు. 
  • దీనివలన వాతావరణంలోసంబవించే మార్పులును తెల్సుకోవచ్చు 
  • సహజ విపత్తులును ముందుగా గుర్తించ వచ్చు 
ఎవరు ఏ పరికరాలును సమకూరుస్తారు ?
NASAISRO
  • L-band
  • సింథటిక్ అపెర్చార్ రాడార్  (SAR)
  • GPS
  • ఘన స్థితి లో ఉన్న రికార్డర్ 
  • S-Band
  • లాంచ్ వెహికల్ 
  • స్పేస్ క్రాఫ్ట్ బస్సు 

GSAT-16: కమ్యునికేసన్ శాటిలైట్ 

  • ప్రస్తుతము ఉన్న శాటిలైట్ : INSAT -3E 
  • INSAT-3E : ఇది రేడియో , టీవీ , ఇంటర్నెట్ (అంతరజాలం) లకు కావలసిన సంకేతలును అందిస్తుంది 
  • ఇది ఒక దశాబ్ద కాలం గా పనిచేస్తుంది , కావున దీని జీవిత కాలం ముగిసింది. 
  • అందువలన INSAT -3E ని GSAT-16 తో బర్తి చేస్తున్నారు 
GSAT-16: ముఖ్యాంశాలు 
ఎప్పుడు ప్రయోగిస్తారు 2015, జూన్ 
రకం
  • కమ్యునికేసన్ ఉపగ్రహం 
  • టివి రేడియో ఇంటర్నెట్ కొరకు 
బరువు 3100 kg
ప్రయోగ వాహన నౌక European Ariane-5 launcher

                                 GSLV MARK-3

PSLV మరియు GSLV మద్య భేదాలు 
PSLVGSLV
Polar satellite launch vehicleGeosynchronous satellite launch vehicle
మొదటి ప్రయోగం  19932001.
మోయగల బరువు : 1600 కె జి 2500 కె జి 
 CARTOSAT, RISAT, OCEANSAT, RESOURCESAT లాంటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ లలో వాడారు INSAT 2E, 3A…., GSAT-2,8,12. లాంటి ఇండియన్ శాటిలైట్ లలో వాడారు 

 PSLV-XL: ఈ శ్రేణిలో అత్యాదునికమైన వాహన నౌక ఇది  1750 kg వరుకు మోయగలదు .దీనిని చంద్రయాన్ రిసాట్ లాంటి ఉపగ్రహాల ప్రయోగాలలో వాడారు 
  • నూతన శ్రేణి :  GSLV MK-3

What is GSLV Mk-3?

 GSLV -Geosynchronous satellite launch vehicle యొక్క నూతన శ్రేణి 
GSLV , GSLV MK -3 మద్య భేదం 
(సాదారణ ) GSLVGSLV Mk-3
మోయగల భరువు :  2500 kg వరుకు 
  •  4500-5000,  INSAT-4 ఉపగ్రహాల ప్రయోగానికి వాడుతారు 
  • ఇప్పటి వరకు ఇన్సాట్-4 ప్రయోగానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ఏరియన్ లాంచ్ వెహికల్ ని వాడేవాళ్ళం 
పొడువు : 49 మీటర్లు 
  • కేవలం 42.4మీటర్లు 
బరువు : 414 టన్నులు 629టన్నులు .
  • ఈ సంవత్సరం నవంబర్ / డిసెంబర్ లో ఇస్రో దీనిని పరీక్షిస్తుంది. 
GSLV MK-3 కి మూడు దశలు కలవు .
1వ దశఘన ఇందన దశ 
2వ దశద్రవ  ఇందన దశ 
3వ దశక్రయోజెనిక్ ఇంజిన్ .
GSLV MK-3 కి వివిధ దశల గల కక్ష్యలలో లో ఉపగ్రహాన్నిపెట్టగల సామర్ద్యం గలదు  :
  • GTO (జియో ట్రాన్స్ ఫెర్ ఆర్బిట్ )(కక్ష్య = ఆర్బిట్ )
  • LEO (లో ఎర్త్ ఆర్బిట్ )లేదా పోలార్ ఎర్త్ ఆర్బిట్ 
  • మద్యస్థ ఆర్బిట్ లు 
  • పై ఆర్బిట్ లలో దేనిలోనైన ఉపగ్రహాన్ని పెట్టగల సామర్ద్యం గలదు 

Liquid Apogee Motor (LAM)

రెండు రకాల ఉపగ్రహ ప్రయోగ(లాంచ్) ఇంజిన్ లు  కలువు  
ఘన ఇంధనం 
  • ఒక్కసారి దీనిని మండిస్తే , ఇందనం అయ్యేవరకు నిరంతరం పనిచేస్తుంది 
  • కావున దీని వేగాన్ని నియంత్రంచాలేము 
ద్రవ ఇందనము 
  • ప్రయోగ వాహన నౌక కావలిసిన వేగాన్ని అందుకున్నాక వీటిని అపేయవచ్చు 
  • వీటిని అవసరం అనుకున్నప్పుడు మరల స్టార్ట్ చేయ వచ్చు కావును ఉపగ్రహాన్ని నిర్ణిత కక్ష్యలో సురిక్షతంగా చేర్చవచ్చు 
  • LAM- Liquid Apogee Motor: ద్రవ ఇందనము తో నడిచే ఇంజిన్ లలో వాడే ఒక పరికరం. 
  • LAM - ఉపగ్రహం నిర్ణిత కక్ష్యలో చేరేందుకు వాడుతారు .
  • LAM లో ఉండే రసాయనాలు : హీలియం , నైట్రోజన్ టెట్రా ఆక్సైడ్ , మోనో ఇథైల్ హైడ్ర జైన్ 
  • ఇస్రో  దీనిని ఇన్సాట్ ఉపగ్రహాల ప్రయోగాలు లో వాడడానికి తాయారు చేసింది 
  • దీనిని ఈ మద్య కాలం లో మంగళయాన్ మరియు IRNSS ప్రయోగాలలో వాడారు.