Monday, 3 September 2012

LATEST CURRENT AFFAIRS-REPORTS

                                                            జూన్

* యునిసెఫ్ నివేదిక ప్రకారం ఈ రెండు వ్యాధుల కారణంగా 2010లో అయిదేళ్లలోపు చిన్నారులు ప్రపంచ వ్యాప్తంగా 21.97 లక్షల మంది మరణించారు. అత్యధిక మరణాల రేటున్న 75 దేశాలతో పోలిస్తే భారత్ అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో నైజీరియా, కాంగో, పాకిస్థాన్, ఇథియోపియా ఉన్నాయి.

* ప్రపంచంలో ధనిక కుటుంబాలు ఎక్కువగా నివసించే దేశాల జాబితాలో స్విట్జర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో ఖతార్, కువైట్ ఉన్నాయి. 'ద బ్యాటిల్ టు రీగైన్ స్ట్రెంత్: గ్లోబల్ వెల్త్ 2012' పేరుతో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ఈ అధ్యయనం నిర్వహించింది.

 * భవిష్యత్తులో పెట్టుబడులకు భారత మార్కెట్ పనికి రాదేమో'అంటూ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) సంస్థ నివేదికను వెలువరించింది.  బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో కూడిన బ్రిక్ దేశాల కూటమిలో ప్రతికూల రేటింగ్ పొందే అవకాశం తొలుత భారత్‌కే ఉందంటూ ఎస్ అండ్ పీ ప్రకటించింది.

* థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వే ప్రకారం సమానత్వం, ఆరోగ్య సంరక్షణ; హింస, వేధింపుల నుంచి తగిన భద్రత కల్పించే విధానాలతో మహిళలకు అండగా నిలిచే దేశాల్లో కెనడా అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఉన్నాయి.

*  హెల్పేజ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో వృద్ధులు తీవ్రంగా వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడైంది. ఈ సర్వేలో భోపాల్ ప్రథమ స్థానంలో ఉంది. హైదరాబాద్ అయిదు, జైపూర్ చివరి స్థానాల్లో ఉన్నాయి. 

* స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో విదేశీయులు దాచుకున్న మొత్తంలో భారతీయుల సొమ్ము కేవలం 0.14 శాతమేనని 'స్విస్ నేషనల్ బ్యాంకు (ఎస్ఎన్‌బీ)' వెల్లడించింది. ఎస్ఎన్‌బీ గణాంకాల ప్రకారం భారత్ 55వ స్థానంలో ఉంది.  2011 చివరికి ఈ బ్యాంకుల్లో 1.53 లక్షల కోట్ల స్విస్ ఫ్రాంకుల (రూ. 90 లక్షల కోట్లు) విదేశీ సొమ్ము ఉందని తెలిపింది. ఇందులో రూ. 12,700 కోట్లు భారత పౌరులు, సంస్థలకు చెందిన మొత్తమని పేర్కొంది.

 *  మెకన్సీ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో పురపాలక సంస్థలు సరఫరా చేసే నీటికి అత్యధిక డిమాండ్ ఉన్న నగరాల్లో ముంబయి, ఢిల్లీ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. నీటికి అత్యధిక డిమాండ్ ఏర్పడనున్న 20 నగరాల జాబితాలో ముంబయి, ఢిల్లీ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. తర్వాత స్థానాల్లో కోల్‌కత (7), పుణె (12), హైదరాబాద్ (16) ఉన్నాయి.

                                       ఆగస్టు 




* ఐరాస ప్రపంచ పెట్టుబడులు నీవేదిక ప్రకారం భారత్ లో 32 బిల్లియాన్ FDIలు వచ్చాయి అని  చెప్పింది.సౌతు ఆసియాలో 39బిలియన్ లు రాగ ఒక్కభారత్ కే 32 బిలియన్లు వచాయి అని చెప్పింది. 

*2012 ఫోర్బ్సు శక్తీ వంతమైన మహిళా జాబితాలో సోనియా గాంధి 6వ స్థానం లో  నిలిచారు. 2011 లో తన స్థానం 7గాఉంది.

1.ఏంజిలమొర్ఖేల్( జర్మని చాన్సుల్లర్)

2.హిల్లరీ క్లింటన్ 

3.  దిల్మ  రౌసఫ్

6. సోనియా గాంధీ

7.మిచెల్  ఒబామా 

12.  ఇంద్రనూయి

58.పద్మశ్రీ వారియర్(ఆంధ్ర కి చెందినా వ్యక్తి, cisco cto) 

59. చందా కోచార్ (ICICI బ్యాంకు  చైర్మన్)

80. కిరణ్ ముజందర్శ(బయో కాన్ వ్యవస్థాపకురాలు)

*ఆగుస్ట-2012 NSSO వారి సర్వే ప్రకారం గ్రామాలలో 10% జనాబా ఖర్చు రోజికి 17రూ  మాత్రమే, పట్టణాలలో  ఖర్చు 23.40/- మాత్రమే. అని చెప్పింది.

*ప్రపంచం లో అవినీతి కరమైన దేశాలలో భారత్ స్థానం  95.

* ప్రపంచం లో ప్రతి ముగ్గుర్లో ఒకరికి హైబిపీ ఉన్నది అని WHO(WORLD HEALTH ORAGNISATION) చెప్పింది.

*అమెరికా ఇటివలప్రకటించాన ఆక్రమవలసదారుల జాబితాలో భారతియలు  30000 అని చెప్పింది

No comments:

Post a Comment