Friday 24 October 2014

APPSC Material - News

నిరాశలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఉద్యోగార్థులు :

కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి, కొత్త ప్రభుత్వాలు కొలివితీరి నెలలు గడుస్తన్నాయి కాని ఇప్పటి వరకు గ్రూప్-1 మరియు గ్రూప్-2 నోటిఫికేసన్ విడుదల గురించి స్పస్థత లేదు,కొన్నిలక్షమంది విద్యార్థులు ఉద్యోగప్రకటనలు కోసం రెండు సంవత్సరాలు నుండి ఎంతో  ఆశతో ఎదురుచూస్తున్నారు, ఆ ఎదురుచూస్తున్న విద్యార్థులు కాస్తా నిరుద్యోగులుగా మారిన  దుస్థితి మన పాలకులు తీసుకోచ్చారు,ఇలా ఎదురుచూస్తున్న వారిలో చాలామంది మారుమూల  గ్రామీణ ప్రాంతాలు నుండి, ప్రభుత్వ బడులలో తెలుగు మీడియం చదివిన విద్యార్థులు, కటిక పేదిరికం నుండి వచ్చిన వారు అదికంగా ఉంటారు, వీరు కోచింగ్ సెంటర్స్లో ఫీజు కట్టలేక, మహా నగరాలలో హాస్టల్ ఫీజు బారం మోయలేక కన్నీళ్లను  దిగమింగుకుంటూ, పస్తులు ఉంటూ,రోజులు తరబడి పుస్తకాలుతో సహవాసం చేస్తూ, తమ లక్ష్యాన్ని తలుచుకుంటూ అనుక్షణం తమ గమ్యాన్ని చేరుకొనేందుకు  ప్రయత్నిస్తున్నారు,  తమ బిడ్డ తొందర్లోనే మంచి ఉద్యోగం సంపాదిస్తాడు అనుకొనే తల్లిదండ్రుల ఆశలును, విద్యార్థుల శ్రమను  సర్కారు నీరుగారిస్తుంది, ఎందకంటే ఇలా చదవే అనేక మంది పేద వారు కాబట్టి, వాళ్ళు తమ నిరసనను బలంగా తెలపలేరు కాబట్టి, పాలక ప్రతిపక్షాలుకు వారు కేవలం వోటర్లు మాత్రమే కాబట్టి, ఒకవేళ నిరసన  తెలిపితే పోలీసులుతో పాసవికంగా వారి గొంతు నోక్కేస్తారుఅదే బడా పారిశ్రామిక వేత్తలుకు చెందిన భూమి వ్యవహారాలు, పోర్ట్లు, కంపని వ్యవహారాలు  అయితే ఆగమేఘాలు మీద  పనులు జరుగుతాయి
చివరసారి పరిక్షలు  2012లో నిర్వహించారు తరువాత 2013లో సంవత్సరికా పట్టిక ను విడుదల చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిసన్ తరహాలో ప్రతి ఏడాది నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని పబ్లిక్ సర్వీస్ కమిసన్ ర్బటంగా ప్రకటించింది , కాని కొత్త రాష్ట్రము  ఏర్పడే ప్రక్రియలో,  నోటిఫికేషన్ విడుదలకు  సంబంధించి రాష్ట్రప్రభుత్వంతో ఉత్తరప్రత్యోత్తరాలు జరిపి  నోటిఫికేషన్ విడుదల చేయకుండా పేద వాళ్ళ బంగారు కలను చిదిమేసే ప్రయత్నం చేసింది, రాజ్యంగబద్దంగా ఎర్పడ్డ  సంస్థ ఐన పబ్లిక్ సర్వీస్ కమిసన్  నోటిఫికేషన్ విడుదల విషయంలో తమ ఇష్టప్రకారం  వెల్లవొచ్చు అని అప్పటి ఉమ్మడి రాష్ట్రప్రభుత్వం చెప్పినా, పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఏమి చేయకుండా సుప్తావస్థ స్థితిలో ఉండిపోయింది ఉత్తరప్రత్యోత్తరాలు జరిపి సంవత్సరం దా టిపోయింది, కానీ ఇప్పటి వరుకు నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి గాని, కనీసం పరీక్షా విధానంలోగాని, సిలబస్లో మార్పులు గురించి గాని ఎలాంటి ప్రకటన లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన గురిఅవుతున్నరు. ఆందోళన ప్రభుత్వవ్యతిరేకఆందోళన, పేద ప్రజల ఆకలి కేకల ఆందోళనగా మారక ముందే ఏలుకులు చొరవతీసుకోని, గ్రామీణ విద్యార్థ ల బ్రతుకలలో ఉద్యోగ వెలుగులు నింపుతారు అని ఆశిద్దాం!!!!

No comments:

Post a Comment