Sunday 19 October 2014

APPSC Current Affairs - Nobel Prize winners -2014



నోబెల్ ప్రైజ్ పుట్టుక :
  • 1896 : డైనమేట్ కనిపెట్టిన అల్ఫ్రెడ్ నోబెల్ మృతి, అతను ఫిజిక్స్ కెమిస్ట్రీ మెడిసిన్ లిటరేచర్  శాంతి  రంగాలలో కృషి చేసిన వారికి అవార్డులు ఇచేందుకు ఒక ఫండ్ ఏర్పాటు చేసాడు 
  • 1901 : అవార్డులు ప్రధానం ప్రారంబమైంది, ఒక్కో కేటగరీ లో గరిస్థంగా ముగ్గురుకి ఇస్తారు 
  • అవార్డు కి నామినేట్ అయ్యేసరికి సదురు వ్యక్తి జీవిస్తూ ఉండాలి . 
  • అక్టోబర్ లో అవార్డు విజేతలును ప్రకటించి, డిసెంబర్ 10 నాడు అవార్డులును ప్రధానం చేస్తారు 
అవార్డులుకు మనీ ఎవరు ఇస్తారు :
  • ఎకానమీ :  బ్యాంకు  అఫ్  స్వీడన్ (Riksbank)
  • మిగతా కేటగిరి అవార్డులు : నోబెల్ ఏర్పాటు చేసిన ఫండ్ నుండి ఇస్తారు . 
అవార్డులు ఎవరు ఇస్తారు :
  • ఓస్లో - నార్వే : నోబెల్ శాంతి బహుమతి
  • స్టాక్ హోం -స్వీడన్ : మిగతా కేటగిరి అవార్డులు
నోబెల్ ప్రైజ్ మీద  ఏమి రాసిఉంటుంది 
  • Economics : ఏమి రాసి ఉండదు 
  • శాంతి : For the peace and brotherhood of men.
  • మిగతా కేటగిరి అవార్డులు : And they who bettered life on earth by new found mastery
భౌతిక శాస్త్ర కేటగిరి - 2014

  1. ఈసము ఆకసకి (జపాన్ )
  2. హిరోషి  అమనో (జపాన్ )
  3. శుజి నకమురా (అమెరికా )
20 సంవత్సరాలు క్రితం వీరు ఇండియం గాలియం నైట్రేడ్ అనే సెమి కండక్టర్ ను ఉపయోగించి బ్లూ  LED((light emitting diode) ను కనుగొన్నారు. ఇది వైట్ LED ఉత్పత్తి కి ఉపయోగ పడింది. ప్రస్తుతం LCD కన్నా LED లైట్  చాలా శ్రేష్థమైనది. 

వైద్య రంగం -2014:
నోబెల్ బహుమతి ని అక్టోబర్ నెలలో మొదటగా ఈ రంగంలోనే ప్రకటిస్తారు 
  1. జాన్ ఓ కీఫే (యు కె )
  2. మే - బిర్ట్ట్ మోసర్ (నార్వే )
  3. ఎడ్వర్డ్ మోసర్ (నార్వే )
ఖాళీ ప్రదేశంలో ఉన్నప్పుడు మన స్థితిని తెలుసుకోవడానికి దోహదపడే పొజిషనింగ్ వ్యవస్థను కనుక్కున్నందుకు వీరికి  ఈ పురస్కారం దక్కింది,ఈ పరిశోధన అల్జీమర్స్, మెదడుకు సంబంధించిన ఇతర వ్యాధులకు చికిత్సలు చేయడానికి దోహదపడుతుంది. 

రసాయన శాస్త్రం -2014:

  1. ఎరిక్ బెత్జిగ్ (US)
  2. విలియం మోఎర్నేర్ (US)
  3. స్టీఫన్ హెల్ (జర్మనీ)


ఈ ముగ్గురూ 'సూపర్ - రిసాల్వ్‌డ్ ఫ్లోరసెన్స్ మైక్రోస్కోపీ' అభివృద్ధికి దోహదపడ్డారు, దీనిద్వారా సూక్ష్మ వస్తువులను పెద్దగా చూపే మైక్రోస్కోప్‌లకు మరింత సునిశిత దృష్టిని సాధ్యపడింది

ఈ మద్య వార్తలలోకి వచ్చిన ఇలాంటి ఒక భారతీయ అంశం :
కాన్ఫోకల్ మైక్రోస్కోప్ :
  • భారతీయ శాస్త్రవేత్తలు దీనిని డిజైన్ చేసారు 
  • దీనికి కౌన్సిల్ ఫర్ సైన్టిఫక్  అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఆర్థిక తోడ్పాటు అందించింది 
  • ఇన్ఫ్రారెడ్ బీమ్ ఉపయోగించి 3D చిత్రలును తయారుచేస్తుంది, ఇలాంటి మైక్రోస్కోప్ బయట దేశాలు నుండి దిగుమతి చేస్తే 4 కోట్లు వరుకు ఉంటుంది , కాని మన కాన్ఫోకల్ మైక్రోస్కోప్ 1.5 కోట్లు మాత్రమే. 

ఆర్థిక శాస్త్రం -2014 :
  • జీన్ తిరోలె (ఫ్రాన్స్)
  • ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలను  నియంత్రించక పోతే =>ప్రైవేటు ఎకస్వామ్యం (మోనోపోలీ )వస్తుంది => కొత్త వారు మార్కెట్ లోకి ప్రవేశించలేరు => అప్పుడు పోటితత్వం పడిపోతుంది  => ఇది ప్రైవేటు కంపెనీలు ధరులు పెంచడానికి దోహదపడుతుంది  => దీని వల్లన మొత్తం మార్కెట్ వ్యస్తే కూలిపోతుంది .
  • టెలికాం,బ్యాంకింగ్,తయారి రంగము మొదలైన పారిస్రమలును జాతియం చేయకుండా ఎలా నియంత్రించాలో  జీన్ వివరించాడు, దీని ద్వార ప్రైవేటు ఎకస్వామ్యలును అరికట్టవచ్చు
శాంతి రంగం -2014 :
  • కైలాశ్ సత్యార్థి(భారత దేశం)
  • మలాలా యూసఫ్ జాయ్‌(పాకిస్తాన్ )
వెట్టిచాకిరి నుంచి బాలలను విముక్తి చేయడానికి పాటుపడుతున్న భారతదేశానికి చెందిన కైలాశ్ సత్యార్థి, బాలికల విద్య కోసం పోరాడుతున్న పాకిస్థాన్ బాలిక మలాలా యూసఫ్ జాయ్‌కు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని సంయుక్తంగా ప్రకటించారు.

కైలాష్  సత్యార్తి :
  • మధ్యప్రదేశ్ కి చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీర్ 
  • బచపాన్ బచావు ఆందోళన్ అనే సంస్తను చిన్నారులు కోసం నడుప్తున్నారు 
  • 80,000 వరకు చిన్నరులును వివిధ కర్మాగారాలు, ఇటుక బట్టి పనులునుండి కాపాడారు,  కొన్నిసార్లు స్థానిక గుండాలు చేత దాడికి కూడా గురికాబడ్డారు. 
  • UNESCO ప్రారంబించిన ఎడ్యుకేషన్ ఫర్ అల్ అనే గ్రూప్ లో సభ్యుడు గా ఉన్నారు 
  • రాబర్ట్ F  కెన్నెది  ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అవర్డ్ (US ) మరియు అలంటి అవార్డులు ను స్పెయిన్ ఇటలీ , యూరోప్ నుండి తీసుకున్నారు. 
  • నోబెల్ బహుమతికి  యురోపియన్ గవర్నమెంట్ నోమినతే చేసింది. 
  • భారతదేశం పద్మ అవార్డు కూడా ఇవ్వలేదు (డర్టీ పిక్చర్ మూవీ హీరొయిన్ కి మాత్రం ఇస్తారు)
భారతదేశం నుండి ముగ్గురుకు శాంతి రంగం లో  నోబెల్ ప్రైజ్ వచ్చింది 
  • 1979 : మదర్ థెరెసా 
  • 2007:R K పచౌరి (IPCC  తరుపున)
  • 2014 : సత్యర్తి 
ఇప్పటివరకు ఇద్దరు పాకిస్తనియులుకు మాత్రమే నోబెల్ ప్రైజ్ వచ్చింది :
  • 1979: అబ్దుస్ సలాం (సబ్ అటామిక్ పార్టికల్ మిధ పరిశోదనకి)
  • 2014 : మలాల 

నోబెల్ ప్రైజ్ పొందిన చిన్న వయస్కురాలు (ఇంతక ముందు ఈ రికార్డు లారెన్స్ బ్రగ్గ్స్ -1915-భౌతిక శాస్త్రం మీద ఉంది )
మలాల : 
  • పాకిస్తాన్ లోని స్వాత్ లోయ ప్రాంతం కి చెందినా వ్యక్తి . 
  • ఆ ప్రాంతం లోని బాలికల  విద్య కోసం పోరాడుతుంది, తాలిబన్లు చేతిలో దాడికి కూడా గురిఐంది. 
  • I'm Malala, Malala:the girl who stood up for education and changed the world అనే పుస్తకాలు రాసింది
సాహిత్యం -2014:
  • పాట్రిక్ మోడిఅనో (ఫ్రాన్స్)
  • నాజిల దురాగతాల గురించి, రెండో ప్రపంచ యుద్ధం గురించి ప్రధానంగా రాసే నవల రచయత 
  • మిస్సింగ్ పర్సన్ : ఇతని ప్రముఖ రచన 
  • 2013 నోబెల్ బహుమతి ఆలిస్ మున్రో (కెనడా) కి లబించింది

No comments:

Post a Comment