Saturday 29 September 2012

Appsc Group 2 suggestions.

గ్రూపు 2 ఉద్యోగం  కోసం చాలా మంది అబ్యార్ధులు ఎంతో ఆశ తో ఎదురు   చుస్తారు. దాని కోసం రాత్రి పగలు కష్టపడతారు. ఐన కొంత మంది విజియం సాదించలేరు, దానికి కారణం తీవ్రమైన పోటి అనుకుంటారు కాని దానికి కారణం సరైన  విధంగా వారి కష్ట పడలేదు అని తెలుసుకోలేరు. సరైన ప్రణాళిక తో చదవితే పోటి లో ఎంత మంది ఉన్న విజియం మనదే  అవుతుంది.

గ్రూపు 2 పరీక్ష  మార్కులు  కు ఉంటుంది?
గ్రూప్ 2  పరిక్ష 400 మార్కులు కు ఉంటుంది. అన్ని ప్రశ్నలు బిట్లు రూపం లో ఉంటాయి. 
గ్రూప 2 పరీక్షా లో మూడు పేపర్ లు ఉంటాయి, ఒక్కో పేపర్ 150 మార్కులు కలిగి ఉంటుంది. పరీక్షా అంత బిట్ల రూపం లో ఉంటుంది, కొద్దిగా తెలివితో కస్తపడితే ఉద్యోగం పొందడం చాల సులబం
పేపర్ :1
జనరల్ స్టడీస్
1.జనరల్ సైన్సు
2.కరెంటు అఫ్ఫిర్సు
3.భారత దేశ చరిత్ర
4.జనరల్ మెంటల్ అబిలిటి
5.విపత్తు నిర్వహణ
పేపర్ 2
దీనిలో రెండు బాగాలు కలవు
a) ఆంధ్ర ప్రదేశ్ సామాజికి సాంస్కృతిక చరిత్ర -75 మార్కులు
b) భారత దేశ రాజ్యాంగం ఒక అవలోకనం -75 మార్కులు
పేపర్ 3:
దీనిలో రెండు బాగాలు కలవు
a )భారత దేశం లో ప్రణాలిక రచన  మరియు భారత దేశ ఆర్థిక వ్యవస్థ-75 మార్కులు
b )ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యక ప్రాధాన్యం ఇస్తూ గ్రామిన సమాజం లో సమకాలినా సమస్యలు పరిణా ములు -75 మార్కులు.

  జనరల్ స్టడీస్ చాలా కష్టం కదా ఎలా చదవాలి ?

*జనరల్ స్టడీస్ చాల కష్టం అనేది అపోహ మాత్రమే.
*జనరల్ స్టడీస్ లో ప్రశ్నలు   జీవితాని కి సంబంధించి చాలా సులబం గా చాల సాధారణం గా అడుగుతారు. 
*4 వ  తరగతి నుండి 10వ  తరగతి వరకు సైన్సు సోషల్ చదివితే చాలా ఉపయోగ పడ్తుంది . 

*మార్కెట్లో దొరికే అడ్డమైన మేతేరియల్ చదివి విలువైన సమయం, డబ్బు ని పాడుచేసుకోవద్దు,

 స్టాండర్డ్ టెక్స్ట్   బుక్స్ మరియు తెలుగు అకాడెమి పుస్తకాలు చదవండి.

*బిట్ల రూపం లో చదవద్దు,  మొత్తం చదవాలి అలా అని అకాడెమి పరిక్షలుకు చదివినట్టు చదవకూడదు.  

 కరెంటు అఫ్ఫైర్స్ కోసం ఏమి చదవాలి ?

*కరెంటు అఫ్ఫైర్స్  చదవడం ఈ  పరిక్ష కు చాలా అవసరం.

*కరెంటు అఫ్ఫైర్స్ కోసం  రోజు దినపత్రికలు చదవాలి. పేపర్ చదవడం లేని వారు తప్పకుండ చదవడం అలవాటు  చేసుకోండి.

*యోజన  లాంటి మాగజైన్ చదివ్తే ఎకానోమి కి సంబందించన విషయాలు మిధ పట్టు సాదించ వచ్చు, అలా అని అ మాగజైన్ లో ఇచ్చే ప్రతి డేటా ని గుర్తు పెట్టుకోవకర్లేదు.



గ్రూపు 2 పరీక్షని  సాదించడానికి చరిత్ర బాగా తెలిసి ఉండాలి అంట కదా ?

*గ్రూపు 2 పరిక్షలో చరిత్ర  నుండి 100 - 110 ప్రశ్నలు రావోచు.

  *చరిత్ర లో సాదారణంగా కష్టపడితే 70 మార్కులు ఇంకొంచెం కస్త పడి పరీక్షలో బాగా అలోచిస్తే 90 మార్కులు వరకు పొందవచు .దీని కోసం మనం చరిత్ర మిధ  phd చేయక్కర్లేదు, సాధారణం గా పదో తరగతి సోషల్ స్టాండర్డ్లోనే  లోనే ప్రశ్నలు ఉంటాయి. 

*ప్రశ్న పత్రం లో చరిత్ర ని రెండు విబాగాలు లో అడుగుతారు 

1.జనరల్ స్టడీస్ లో భారత దేశ చరిత్ర ని (20 నుండి 30 మార్కులు).

2.రెండో  పేపెర్లో ఆంధ్రుల చరిత్ర ని 75 మర్కులుకు అడుగుతారు.

*భారత దేశ చరిత్ర కొద్దిగా ఎక్కవ బాగం ఉంది తకువ ప్రశ్నలు వస్తాయి కాని ఆంధ్రులు చరిత్ర చాల తకువ బాగం మరియు ఎక్కవ ప్రశ్నలు వస్తాయి, మనకు గ్రూపు 2 ఉద్యోగం రావాలంటే సుల్బమైన పద్దతి ఆంధ్రుల హిస్టరీ మిధ పట్టు సాదించడం. దీనికోసం మనం ఓ నెల రోజులు సమయం కేటాయిస్తే 75 మర్కులుకు గాను 65 నుండి 72 మార్కులు సులబంగా సంపాదించ వచ్చు.భారత దేశ చరిత్ర కోసం మన  పుస్తకాలు మరియు కొద్దిగా మంచి మేటేరియల్  చదివ్తే సరిపోతుంది. 

Click here for syllabus:

Click here for reference books

Click here for Material:

No comments:

Post a Comment