భారత దేశం లో విద్యుత్ వ్యవస్థ:
* గ్రిడ్ విఫలం కావడం వలన ఉత్తర భారత దేశం లో చీకటి అలముకుంది, ప్రపంచంలో దాదాపు 10% జనాభా అంధకారం లో గడిపింది.*తయారు రంగం కి, సేవ రంగం కి విద్యుత్ ఆయువాపట్టు లాంటిది, భారతదేశం తను అనుకునట్టు 8-9% వృద్ది సాదించాలి అంటే నిరంతరాయం విద్యుత్ కావాలి.
*భారతదేశం యొక్క ప్రస్తుత విద్యుత్ సామర్థ్యం 205 gigawatts (1GW 1,000 MW).
*చైనా లో తలసరి విద్యుత్ వినియోగం భారతదేశం యొక్క తలసరి వినియోగం కంటే 3.5 రెట్లు ఎక్కువ ఉంటుంది. [ఏదైనా దేశం యొక్క విద్యుత్, సిమెంట్ లేదా ఉక్కు వినియోగం భారతదేశం కంటే ఎక్కువ గా ఉంటే, వారు మన కంటే అభివృద్ధిలో ముందు ఉన్నారని అర్ధం].
* దాదాపు భారతదేశం లో 77% విద్యుత్ ఉత్పత్తి జల విద్యుత్ మరియు బొగ్గు ద్వారా అందుతుంది.
coal:56.65%
gas:9.2%
oil:0.58%
Hydro:19.13%
Nuclear:2.32%
Ohter renewable sources:12.09%
భారత దేశం లో జల విద్యుత్ తో గల సమస్య ఏమిటి ?
*చైనా- లో త్రీ గోర్జెస్ డ్యామ్, చైనా యొక్క విద్యుత్ వినియోగంలో 10% అవసరాలును తీరుస్తుంది, భారతదేశంలో జల విద్యుత్ , విద్యుత్ అవసరాలు లో కేవలం 20 శాతం తీరుస్తుంది.*భారతదేశంలో ఎన్నో జల వనరులు ఉన్న ఇంత తక్కువ జల విద్యుత్ ఉత్పద్ననానికి కారణం ఏమిటి?
1.సరైన ముందు చూపు లేకపోవడం,
2.ప్రభుత్వాల మందకొడి విధాన నిర్ణయలు
3.బలహీనమైన చట్టలు అమలు లో ఉండడం. (మొత్తం నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వం ఏ ప్రాజెక్టులు ప్రారంబించలేక పోతుంది)
4.రాజికియ దృడ సంకల్పం లేకపోవడం, అరుణాచల ప్రదేశ్ లో పుష్కలంగా వనరులు ఉన్న చైనా తో సరిహద్దు సమస్య వలన అక్కడ కూడా ఉత్పత్తి చేయలేకపోతున్నాము.
బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి గురించి
* మొత్తం విద్యుత్ ఉత్పత్తి లో బొగ్గు వాట సగం కి పైగా ఉంది
* మన దేశం ప్రపంచంలో ఐదవ పెద్ద బొగ్గు రిజర్వ్ను కలిగి ఉంది, కానీ దాని నాణ్యత ఎందుకంటే కార్బోన్ శాతం తక్కువ ఉండటం వలన.
బొగ్గు లోని రకాలు :
1.అంత్ర సైట్ (కార్బన్ 90-95% ఉంటుంది)-మన దేశంలో జమ్మూ కాశ్మీర్ లో దొరుకుతుంది 2.బిట్యు మినాస్(కార్బన్ 80-90%)-మన దేశంలో లబించే బొగ్గు
3.లిగ్నైతే (30-50%)-తమిళ నాడు లో దొరుకుతుంది
4.పీట్ (10%)
*భారతదేశంలోబొగ్గు ఉత్పతి విద్యుత్ అవసరం పెరిగినత్త వేగం గా పెరగడంలేదు.
*చైనా లో పెరుగుతున్న ఉత్పత్తి తో పోలిస్తే, భారత ఉత్పత్తి గత రెండు సంవత్సరాలలో దాదాపు స్థిరంగా ఉంది.
*ఇప్పటికే ఉన్న గనుల నుండి ఎక్కువ వెలికి తీయకుండా పరిమితుల కలవు.
*కొత్త గనుల నుండి వెలికితీయాలి అంటే పర్యావరణ సమస్యలు మరియు ఆ భూమిని సేకరించడం లో సమస్యలు ఎదురు అవుతున్నాయి.
గ్రిడ్ వైఫల్యం వెనుక కారణం ఏమిటి?
* భారత దేశం లో మొత్తం 5 ప్రాంతీయ గ్రిడ్ల కలవు.
* జాతీయ విద్యుత్ ప్రసార నెట్వర్క్ ఈ ఐదింటిని కల్పుతుంది.
* కొన్ని రాష్ట్రాలు ఈ నెట్వర్క్ నుండి తమ వాటా కంటే ఎక్కువగా తీసుకొంటూనాయి,ఇలా తీసుకోవడం వలన గ్రిడ్ ఫ్రేక్వేన్సి దెబ్బ తిన్నది, భారత దేశం లో గ్రిడ్ ఫ్రేక్వేన్సి 50 Hz గా నిర్ణయించారు.
ఎందుకు రాష్ట్రాలు తమ వాటా కన్నా ఎక్కువ తీసుకొంటూనాయి?
వర్షాలు లేకపోవడంతో రైతులు ఎక్కవ బోరు బావులు మీద అధారు పడుతున్నారు, అందు వలన కరెంట్ వినియోగం ఎక్కువ ఐంది.
పెరిగితున్న ఎలక్ట్రిక్ పరికరాలు వలన, ఉచిత విద్యుత్ వలన రైతులు అవసరం ఉన్న లేకపోయినా బోర్ లు వాడడంవలన కరంటు వినియోగం పెరిగుతుంది, భూ గర్బ జలాలును తిసేయడం వలన భూమి సారం పోతుంది,
కొంత మంది ఉచిత విద్యుత్ ని దొంగతనం గా పరిస్రమలుకు వాడుతున్నారు.
విద్యుత్ గ్రిడ్ అంటే ఏమిటి?
గ్రిడ్ అనేది వివిధ ట్రాన్స్మిసన్ లైన్లను కలిగి ఉండే ఒక నెట్వర్క్:
ఈ గ్రిడ్ కి ఒక వైపు విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ జేనేరేసన్ కేంద్రాలు,మరో పక్క ఆ విద్యుత్ ని తీసుకునే లోడ్ సెంటర్ లు కలిగి ఉంటాయి. లోడ్ సెంటర్ లు తము సేకరించన విద్యుత్ ని తమ కస్టమర్లుకి అందిస్తుంది.
ఒక విద్యుత్ గ్రిడ్ సాఫీగా పని చేయడానికి ఏమి ఉండాలి?
1. జేనేరసన్ స్టేషన్ లు పంపే విద్యుత్, లోడ్ సెంటర్ లు తీసుకునే విద్యుత్ సమానం గా ఉండాలి.(మనం గ్రిడ్ ఐతే మనం సంపదేంచే సొమ్ము, ఖర్చు పెట్టె సొమ్ము సమానంగా ఉండాలి లేకపోతే ఏమి అవుతుందో మన అందరికి తెల్సు,
మనం అనేక నరాల కలయక, అలాగే గ్రిడ్ అనేక ట్రాన్సమిసన్ లైన్ల కలయక )
2.ట్రాన్సమిసన్ లైన్లు నుండి నిర్దేశించిన కెపాసిటీ మేరకే విద్యుత్ ప్రవహించాలి, ఎక్కవు ప్రవహిస్తే ట్రాన్సమిసన్ లైన్లు దెబ్బతింటాయి.
ఎప్పుడు గ్రిడ్ వైఫల్యం చెందుతుంది?
గ్రిడ్ వైఫల్యానికి రెండు ప్రధాన కారణాలు కూడా ఉండవచ్చు.మొదటి కారణం: పొగమంచు మరియు కాలుష్యం వంటి కారణాల వలన గ్రిడ్ లోని పరికరాల వైఫల్యం చెందొచ్చు.
రెండవ కారణం: ఒకటి లేదా ఎక్కువ లోడ్ సెంటర్లు తమకు కేటయించన వాటా కన్నా ఎక్కవ తిసుకున్నపుడు.
లేదా పవర్ జేనేరసన్ సెంటర్ లు అవసరం ఐన దానికన్నా ఎక్కువ విద్యుత్ ని ఉత్పత్తి చేసినపుడు.
No comments:
Post a Comment