Wednesday, 12 September 2012

Appsc Materila-NCTC

 NCTC అవసరం ఏమిటి?

* NCTC అనగా  జాతీయ కౌంటర్ టెర్రరిజం సెంటర్
*
26/11 దాడుల తరువాత  ప్రభుత్వం తీవ్రవాదం సమస్య పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక విబాగం అవసరం అని భావించారు.* ఇది అమెరికన్ NCTC మరియు బ్రిటన్ యొక్క ఉమ్మడి టెర్రరిజం ఎనాలిసిస్ సెంటర్ ఆదారం గా రూపొందించబడింది.

NCTC ఏమి చేస్తుంది?

* ఇది భారతదేశంలోని  ఏ ప్రాంతంలోనైన సోదాలు మరియు అరెస్ట్లు  చేసే  అధికారం కలిగి ఉంటుంది.
* తీవ్రవాద చర్యలుకు సంబందించిన డేటా అంత సేకరించి దానిని విస్లేస్తుంది, మరియు 
తీవ్రవాదలు మరియు వారి సహచరులు,వారి కుటుంబాలు వివరాలును సేకరిస్తుంది.
 *
NCTC
సమర్థవంతముగా అన్ని తీవ్రవాద చర్యల నియంత్రణకు  మరియు తీవరవాద వ్యతిరేఖ చర్యలను సమన్వయం చేసే కేంద్రం గా ఉంటుంది.

Multi-ఏజెన్సీ సెంటర్ (MAC) అంటే  ఏమిటి ?

* ఇది వివిధ సంస్థలు నుండి వచ్చిన వివిధ నిఘా సమాచారం ని విశ్లేషించడానికి ఉపయోగిస్తున్నారు,
* ఉదాకి :
    
రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్లు,
    
ఆర్థిక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ,
    
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తదితర సంస్తులు నుండి సమాచారం సేకరిస్తుంది.* Home మంత్రిత్వ శాఖ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో కింద
ఈ MAC పని చేస్తుంది.* అయితే భవిష్యత్తులో NCTC కిందకు MAC రావొచ్.

భారత NCTC అమెరికా మరియు UK మోడల్ కు భిన్నంగా ఎలా ఉంటుంది?

* అమెరికా NCTC కేవలం సమాచారం సేకరించి, దానిని అములు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తుంది, ఇది ఎటువంటి అర్రెస్ట్లు గాని సొదాలు గాని, అపెరేసన్ గాని, నిర్వహించదు.
* UK యొక్క ఉమ్మడి టెర్రరిజం ఎనాలిసిస్ సెంటర్ కేవలము అన్ని విబగాలను సమన్వయపరుస్తుంది.
 *
కానీ భారత NCTC భారతదేశం ఎ ప్రాంతం లోనైన ప్రత్యక్ష కార్యకలాపాలు,దాడులు,అరెస్టులు నిర్వహించడం మరియు నిఘా విధులు కూడా నిర్వహిస్తుంది .

NCTC అములుతో సమస్య ఏమిటి?

* NCTC మార్చి 2012 నుండి పని ప్రారంభించాలి, కానీ NCTC మన దేశం యొక్క సమాఖ్య నిర్మాణం వ్యతిరేకంగా  ఉంది అని నాన్-కాంగ్రెస్ ముఖ్యమంత్రులు బృందం నుండి వ్యతిరేకత రావడం తో ఇది వాయిదా పడింది.
* ఇది అములు లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వంకు తెలియజేయకుండా కేంద్రం,  రాష్ట్రాలలో అరెస్టులు చేసే అధికారం ఉంటుంది,
 *ఉదారణకు ఒక తీవ్రవాది ఒక రాష్ట్రము లో ఉన్నాడు అని తేల్సతే
NCTC ఆ వ్యక్తి ని ఆ రాష్ట్రము ప్రబుత్వం కి తెలపకుండా అర్రెస్ట్ చేయవచు.
*దీని వలన రాష్ట్రాల హక్కులు తగ్గించ పడతుంది, మరియు కేంద్రం లో అధికారంలో ఉన్నప్రభుత్వం తన వ్యతిరేఖ పార్టీ లు అధికారం లో ఉన్న  రాష్ట్రాల మిధ అధికార దుర్వినియోగ పరచవచ్చు. ఇప్పడికే ఆర్ధికంగా(అధిక రాబడి వచ్చే పన్నులు కేంద్రంవే) కేంద్రం మిధ ఆదరపడుతున్న రాష్ట్రాలు, శాంతి బద్రత హక్కులు కూడా కోల్పోవడానికి సిద్దముగా  లేవు.
* ఈ భయం అరికట్టేందుకు హోం మంత్రిత్వ శాఖ కొన్ని నిబంధనలును మార్పు చేసింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో నుండి అత్యంత అనుభవం గల పోలీసు అధికారులు, పోలీస్ డైరెక్టర్ జనరల్స్ మరియు అన్ని రాష్ట్రాల  తీవ్రవాద
వ్యతిరేక బృందాల నాయకులు-  NCTC యొక్క స్టాండింగ్ కౌన్సిల్ లో  సభ్యులు గా ఉంటారు.NCTC తమ రాష్ట్రంలో ఆపరేషన్ నిర్వహిస్తే వారికి తెలయజేస్తారు.
*మరియు NCTC అరుదగా మాత్రమే దాడులు చేస్తుంది అని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

NIA అంటే ఏమిటి ?

* జాతీయ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (NIA) 26/11 దాడుల తర్వాత స్థాపించబడింది. 
* కాబట్టి NCTC ఏర్పడితే ఈ రెండింటి అధికారాలు  మద్య సమస్యలు తలెత్తా వచ్చు *
*అయితే చిదంబరం NIA  కేవలం  NCTC కి  ముందున్న ఒక విబాగం మాత్రమే అని భరోసా ఇచ్చారు. (కాబట్టి ఒకసారి NCTC అమల్లోకి వస్తే , NIA అనేది  NCTC లో కలిసిపోవడం లేదా  కింద పనిచేయడం చేస్తుంది)

NCTC ప్రస్తుత స్థితి ఏమిటి ?

* ప్రణబ్ అధ్యక్షుడయ్యారు తరువాత, చిదంబరం ఆర్థిక మంత్రి ,షిండే Home మంత్రులు గా బాద్యతులు తీసుకున్నారు.
* కానీ షిండే తన మొదటి బహిరంగ ఉపన్యాసాములో నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ (NCTC) లేదా నేషనల్  ఇంటెలిజెన్స్ గ్రిడ్ (NATGRID) గురించి ప్రస్తావించలేదు.
* అంటే హోం మంత్రిత్వ శాఖ వీటిని పక్కన పెట్టింది అనుకోవచ్చు. [బొగ్గు కుంభకోణం సందడిలో అందరు బిజీగా ఉన్నారు కదా]

No comments:

Post a Comment