Friday 7 September 2012

appsc Material CRR, SLR, BANK RATE, REPO RATE, REVERSE REPO RATE

 CRR, SLR, BANK RATE, REPO RATE, REVERSE REPO RATE

1.CRR క్యాష్ రిజర్వ్ రేషియో) అంటే ఏమిటి ?
భారతదేశం లో ఉన్న బ్యాంక్స్ తమ దగ్గర ఉన్న డిపాజిట్సులో కొంత బాగం నగదు రూపంలో RBI దగ్గర ఉంచాలి, దీనినే  CRR అంటారు 
ప్రస్తుత CRR 4.75% గా ఉంది

ఉదా: SBI  డిపాజిట్ లు మొత్తం రూ .100అయితే, SBI Rs.4.75ను RBI(రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా) దగ్గర జమ చేయాలి, ఇప్పుడు SBI దగ్గర 95.25రూపాయలు మాత్రమే ఉంటాయి.
CRR నిబందన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC), మ్యూచువల్ ఫండ్లు లేదా భీమా కంపెనీలకు వర్తించదు.

షెడ్యూల్డ్ కమర్సియాల్  బ్యాంకు  అంటే  ఏమిటి ?

1934- భారతదేశ రిజర్వ్ బ్యాంక్ చట్టం లోని  రెండవ షెడ్యూల్ లో నమోదుయిన  బ్యాంకులు.  షెడ్యూల్ జాబితాలో గల  బ్యాంకులు రెండు నిబందనలు పాటించాలి.
1.బ్యాంకు చెల్లించిన మరియు సేకరించిన నిధుల  5 లక్షల
కంటే తక్కువ ఉండకూడదు. 

2.బ్యాంకు చర్యలు  ఖాతాదారులు ప్రయోజనలుకు నష్టపర్చేల ఉండరాదు.
షెడ్యూల్డ్ కమర్సియాల్ బ్యాంకులుకు  ఉదాహరణలు
పబ్లిక్ సెక్టార్                                                         ప్రైవేట్ సెక్టార్
మెజారిటీ
వాటా ప్రభుత్వం చేతిలో ఉంటుంది.           మెజారిటీ వాటా ప్రైవేట్ వ్యక్తిల చేతిలో ఉంటుంది.   
భారతదేశం యొక్క స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)               
ఐసిఐసిఐ,
పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB
మొదలైనివి         హెచ్డీఎఫ్సీ,AXIS బ్యాంక్ మొదలైనివి 



CASE-1:  CRR మరియు SLR ఎక్కువగా ఉంటె?

ఉదా :
SBI లో దేశం మొత్తం ప్రజలు వంద రూపాయలు డిపాజిట్ చేసారు అనుకుందాం.
ఇప్పుడు  SBI దగ్గర మొత్తం డిపాజిట్లు                                                                                              100

CRR 15%గా ఉంది అనుకుందాం, కావున  
SBI 15రూపాయిలిని RBI దగ్గర పెట్టాలి(ఈ 15కి RBI ఎలాంటి వడ్డీ చెలించదు)                                     -15
SLR: 38% గా ఉంది అనుకుందాం కావున
 SBI  తన మొత్తం డిపాజిట్లో 38%ను  ప్రభుత్వ సెక్యూరిటీల / ట్రెజరీ బాండ్లు రూపం లో పెట్టాలి                -38
(ఈ 38% కి ప్రభుత్వం కొంత వడ్డీ ని ఇస్తుంది)
ఇప్పుడు SBI దగ్గర ఉన్న మనీ(100-15-38)                                                                  47

CASE-1: CRR మరియు SLR తక్కువ గా ఉంటె?

ఉదా :

SBI లో దేశం మొత్తం ప్రజలు వంద రూపాయలు డిపాజిట్ చేసారు అనుకుందాం.
ఇప్పుడు  SBI దగ్గర మొత్తం డిపాజిట్లు                                                                                              100

CRR 4.75% గా ఉంది అనుకుందాం, కావున  
SBI 4.75 రూపాయిలిని RBI దగ్గర పెట్టాలి(ఈ 4.75 కి RBI ఎలాంటి వడ్డీ చెలించదు)                           -4.75      
SLR: 23% గా ఉంది అనుకుందాంకావున
 SBI 23% తన మొత్తం డిపాజిట్లో 23%ను  ప్రభుత్వ సెక్యూరిటీల/ట్రెజరీ బాండ్లు రూపం లో పెట్టాలి            -38

(ఈ 23% కి ప్రభుత్వం కొంత వడ్డీ ని ఇస్తుంది)
ఇప్పుడు SBI దగ్గర ఉన్న మనీ(100-4.75-23)                                                                             72.25

 పైన తెల్పిన రెండు సందర్బాలలో బ్యాంకు నడపడానకి అయ్యే ఖర్చు ఒకటే,
 అవి ఉదాహరనుకు 
1.బ్యాంకు పి.ఒ., 
2.క్లర్క్స్,  
3.భద్రతా సంరక్షకులకు వేతనం (రస్టెడ్ తుపాకీలతో),
4.Office అద్దెకు,
5. ATM మెషీన్ యొక్క విద్యుత్ మరియు నిర్వహణ. 
6.వార్తాపత్రిక advertizements.
పైన అన్నిటికి ఖర్చులు పోగా, SBI తను కొంత లాబం గా ఉంచుకోవాలి అనుకుంటుంది.
ఈ లాబం, ఖర్చులు CRR , SLR తో సంబంధం లేకుండా ఉంటాయి.
CASE:1 SBI చేతిలో Rs.47 మాత్రమే కలిగి ఉన్నప్పుడు తను నిర్ణయించుకున్న లాభం రావడానికి  ఏమి చెయ్యగలదు?
ఖచ్చితంగా SBI వినియోగదారుల అందించే కారు,ఇంటి, బైక్, వ్యాపారలకు ఇచ్చే రుణాల వడ్డీరేట్లును పెంచుతుంది. 
case:2   SBI దగ్గర  Rs.72 కలిగి ఉన్నప్పుడు ఏమి చెయ్యగలదు?
SBI యాజమాన్యం దగ్గర ఎక్కవ మనీ ఉండటం తో కస్టమర్లను ఆకర్షించడానికి  కారు,ఇంటి, బైక్, వ్యాపారలకు ఇచ్చే రుణాల వడ్డీరేట్లును తగ్గిస్తుంది,SBI పోటిని తట్టుకోడానికి మిగత బ్యాంక్లు కూడా వడ్డీ రెట్లు తగ్గిస్థాయి.

రెపో రేటు అంటే ఏమిటి ?

మనం ఇక నుండి sbi దగ్గర 72 ఉంది అనుకుందాం.
1.ఈ మద్య కాలం లో పల్సర్ బైకులును ప్రజలు ఇస్తాపపడుతున్నారు  అని బ్యాంకు యాజమాన్యం తెల్సుకుంది అనుకుందాం, ఎందుకంటే ఎక్కడ చుసిన ప్రజలు పల్సర్ బైక్లు గురించే మాట్లాడుకుంటారు. 
2. కాబట్టి వ్యక్తిగత రుణాలు (EMI) లేదా క్రెడిట్ కార్డు ఆధారిత షాపింగ్ కు  డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ SBI దగ్గర  Rs.72.25 మాత్రమే ఉంది.
3. SBI, RBI దగ్గర నుండి కొంత డబ్బుని 8% వడ్డీ రేటుకు తీసుకొని, ఆ డబ్బుని వినియోగదారులకు వ్యక్తిగత ఋణంను 16% కి ఇస్తుంది (అందువలన 16-8 = 8% sbi కి 8%లాబం వస్తుంది).
4.RBI  తీసుకుంటున 8% వడ్డీ రేటును రేపో రేటు అంటారు,
5.RBI తన  కస్తమర్లుకి ఇచ్చే స్వల్పకాలిక రుణాల పైన విదించన వడ్డీ రేట్ ని రేపో రేట్ అంటారు 

రివర్స్ రేపో రేటు అంటే ఏమిటి ?

1.పేరులో ఉన్నట్టు  గానే ఇది రేపో రేటు కి వ్యతిరేఖం 
2.మార్కెట్లో ప్రజలు రుణాలు తీసుకోవడానికి ఆశక్తి చూపకపోతే, SBI దగ్గర ఉన్న 72.25లో కొంత మనీ  బ్యాంకు దగ్గర ఎలాంటి వడ్డీ రాకుండ ఉండిపోతుంది.
3.అప్పుడు sbi తన దగ్గర ఉన్న మిగులు డబ్బుని rbi దగ్గర పెడ్తుంది.ఇలా sbi, rbi దగ్గర దాచిన మనీ కి rbi      కొంత వడ్డీని ఇస్తుంది, ఈ వడ్డినే రివెర్స్ రేపో రేట్ అంటారు.
4. rbi తను కస్తమరులు దాచుకున్న స్వల్పకాలిక డిపాజిట్ లకు ఇచ్చే వడ్డినే రివర్స్ రేపో రేట్  అంటారు 
5.ప్రస్తతుం ఉన్న రివెర్స్ రేపో రేట్ 7% , rbi నిబందనలు ప్రకారం రేపో రేట్ కన్నా రివర్స్ రేపో రేట్ 1% తక్కువగా ఉంటుంది.
6.ప్రస్తతం ఉన్న రేపోరేట్ 8%

బ్యాంకు రేట్ అంటే ఏమిటి ?

 rbi తన ఖాతాదారులుకు ఇచ్చే  దీర్ఘకాలిక రుణాలకు వసూలు చేసే వడ్డీ రేట్ ను బ్యాంకు రేట్ అంటారు.
రెపో రేటు అంటే స్వల్పకాలిక  రుణాలు పైన వసులు చేసే వడ్డీ రేట్.

* ఆర్బిఐ యొక్క ఖాతాదారులగా ఎవరు ఉన్నారు?

1.కేంద్ర ప్రభుత్వం    

2.రాష్ట్ర ప్రభుత్వం

3. నాబార్డ్ 
4.వాణిజ్య బ్యాంకులు (SBI, ICICI etc) 
5.Muthoot ఫైనాన్స్ మరియు Mannapuram గోల్డ్ లోన్ వంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు       (NBFC) మొదలైనవి,(* పైనవి మాత్రమే కాకుండా చాల ఉన్నాయ్ అని గమనిచాలి)
బ్యాంకు రేట్, రెపో రేటు మరియు రివర్స్ రెపో రేటు RBI క్లయింట్లు అందరికి వర్తిస్తుంది.
         CRR, SLR మాత్రం వాణిజ్య బ్యాంకులుకు  వర్తిస్తుంది. (అర్బన్ సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మినహాయింపు కలదు)

CRR, SLR, రెపో రేట్లు అవసరం ఏమిటి?

1.rbi ప్రధాన విధి ద్రవ్య సరఫరా(మనీ supply) ని తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణం(inflation) ని తగ్గించడం 
2.మార్కెట్ లో ఎక్కువ మనీ  ఉంటె సులబంగా రుణాలు వస్తాయి, కావున వస్తువులుకు డిమాండ్ పెరిగి వస్తువుల దరలు పెరిగి పోతాయి, ఇది  ద్రవ్యోల్బణం(inflation) కు దారి తిస్తుంది, దినిని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం(inflation)అంటారు 
3.మార్కెట్లో మనీ తక్కువగా ఉంటె ఒక వస్తువు తయారికి కావాల్సిన ముడి పదార్దాల  రెట్లు పెరిగిపోతాయి,కావున వస్తువు దర పెరిగి ద్రవ్యోల్బణం(inflation) కి దారి తీస్తుంది, దీనిని కాస్ట్ ప్రేరిత ద్రవ్యోల్బణం(inflation) అంటారు.
4.ద్రవ్యోల్బణం(inflation) స్తిరంగా ఉంచడానికి rbi  ద్రవ్య సరఫర ఎక్కవ, తక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. దీనినే rbi ద్రవ్య విధానం(Monetary policy) అంటారు.
5.డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఉన్నపుడు rbi, CRR, SLR ని పెంచుతుంది, అప్పుడు బ్యాంక్లు దగ్గర ఎక్కవ మనీ ఉండక తకువ రుణాలు ఇస్తాయి, ఇప్పుడు ప్రజల దగ్గర మనీ తక్కువ ఉంది తక్కువ చేస్తారు చేస్తారు, ఈ విదంగా దరులు అదుపులో ఉండి, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంటుంది 
6.కాస్ట్ ప్రేరిత ద్రవ్యోల్బణం(inflation) ఉన్నపుడు పైన చేసినదానికి వ్యతిరేఖంగా rbi ఇప్పుడు చేస్తుంది 

1.1990 కు  CRR 15% కన్నా, SLR 38.5% కన్నా  ఎక్కువ ఉండేది, ఇది వ్యాపార వేత్తలుకు ఇబ్బందిగా ఉండేది 
2.1992 RBI రెపో రేటుని ప్రవేశ పెట్టింది.
3.1996 RBI రివర్స్ రెపో రేటు ని 
ప్రవేశ పెట్టింది.

4.1999 RBI బ్యాంకుల CRR డిపాజిట్లకు వడ్డీని  చెలించడం మొదలు పెట్టింది.
5.2007 USA లో సబ్ ప్రైమ్ సంక్షోభం మొదలైంది, RBI CRR డిపాజిట్లకు  వడ్డీ రేట్లు చెల్లించడం మానేసింది.
6.2010యూరో జోన్ సంక్షోభం మొదలైంది, ద్రవ్యోల్బణం పెరిగి పోతుండడంతో, ఆర్బిఐ దాన్ని పరిష్కరించడానికి  రెపో రేటు ని పెంచుతుంది.
7.2011 ఏడాది పొడవునా, RBI ద్రవ్యోల్బణం ని తగ్గించడానికి  రెపో రేటు ని పెంచుతూ పోయింది.
     రెపో రేట్లు గరిస్తంగా 8.50%కు చేరుకుంది .
 

8.2012-ఆగష్టు :   బ్యాంకు రేట్ = 9%
                        రేపో రేట్  = 8% (రివర్స్ రెపో రేట్ =8-1 = 7%)
                        CRR = 4.75%
                        SLR = 23%గా ఉన్నాయ్(ఇవి మారుతు ఉంటాయి అని గమనించాలి)


No comments:

Post a Comment